Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-తేజ(హోరా హోరి)

Wed 09th Sep 2015 07:19 AM
hora hori,teja,dileep,daksha,damodar presad  సినీజోష్ ఇంటర్వ్యూ-తేజ(హోరా హోరి)
సినీజోష్ ఇంటర్వ్యూ-తేజ(హోరా హోరి)
Advertisement
Ads by CJ

దిలీప్, దక్ష జంటగా శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా హోరా హోరి. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ తేజతో సినీజోష్ ఇంటర్వ్యూ..

ఇదొక విలన్ స్టొరీ..

ఈ కథ ఓ లవ్ స్టొరీ అనడం కంటే విలన్ స్టొరీ అంటే బావుంటుంది. సినిమా కూడా అతనితోనే మొదలవుతుంది. ప్రేమ, ఆకర్షణ అనే రెండు విషయాల్లో ఏది నిజమో తెలుసుకునే పోరాటంలో హీరోయిన్ ట్రోమా లోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన అమ్మాయి ఓ అబ్బాయి వల్ల ట్రోమా నుంచి బయటపడుతుంది. ట్రైయాంగల్ లో వెళ్ళే ఓ లవ్ స్టొరీ ఇది.

యాక్టర్స్ ను అయితే హింసిస్తా..

ఈ సినిమా షూటింగ్ మొదట చిరపుంజి ప్రాంతంలో నిర్వహించాలనుకున్నాం. కాని చిరపుంజి కంటే ఆగుంబే అనే ప్రాంతం అత్యధిక వర్షపాతం నమోదయ్యే చోటని తెలుసుకొని అక్కడ షూటింగ్ చేసాం. కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఆ ప్రదేశం కింగ్ కోబ్రాస్ కు హెడ్ క్వార్టర్స్. షూటింగ్ టైంలో పాములు చాలా కనిపించేవి. కాని నాకు వాటిని చంపడం నచ్చదు. పని విషయంలో యాక్టర్స్ ను హింసిస్తా కాని మూగజీవుల్ని హింసించడం నచ్చదు.

చిన్న టీంతో సినిమా కంప్లీట్ చేశా..

ఈ సినిమా షూటింగ్ మొత్తం 54 రోజుల్లో ముగించేసాం. వైజాగ్ లో పది రోజులు షూటింగ్ చేసాం. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం వర్షంలో చేయాల్సివుంది. ఆగుంబే లో ఒక్కొక్కసారి వర్షం పడకపోతే మరొక ఆప్షన్ ఉండాలని రైన్ మెషిన్ తయారుచేయించాం. అతి తక్కువ బడ్జెట్ లో నేచురల్ గా ఉండాలని రైన్ మెషిన్ ఉపయోగించాం. ఆ మెషిన్ కు కేవలం వెయ్యి లీటర్ల నీరు సరిపోయేది. ఒక మనిషి మాత్రమే దానిని ఆపరేట్ చేసేవాడు. సాధారణంగా సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ పనిచేస్తాయి. కాని మా సినిమాకు 5 నుంచి 6 క్రాఫ్ట్స్ మాత్రమే పని చేసాయి. కొన్ని డిపార్ట్ మెంట్స్ లేకుండానే సినిమా చేసాం. చిన్న టీం తో వెళ్లాం. టీం కోపరేషన్ తో తక్కువమంది ఉన్నా మంచి క్వాలిటీతో  అనుకున్న సమయంలో సినిమా కంప్లీట్ చేసాం.

లైట్ లేకుండానే సినిమా చేసాం..

తంజావూర్ టెంపుల్ కి అఫీషియల్ ఫోటోగ్రాఫర్ గా పని చేసే దీపక్ భగవంత్ మొదటిసారి ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసారు. ఆయన ఎల్.వి.ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో ఫోటోగ్రఫీ చేసారు. హైదరాబాద్ నుంచి ఆగుంబే కు మేము ఒక లైట్ మాత్రమే తీసుకెళ్ళాం. ఒక టైంలో అది కాస్త పగిలిపోయింది. ఇంక లైట్ లేకుండానే సినిమా చేసాం. దానివల్ల సినిమాకు కొత్త లుక్ వచ్చింది. 

రియల్ లైఫ్ డ్రామాలా ఉంటుంది..

ఈ సినిమా కోసం ఫోర్త్ వాల్ స్టైల్ అనే ఓ కాన్సెప్ట్ ను ఉపయోగించాం. దానివల్ల సినిమా చూస్తున్న వారికి రియల్ గా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా హైట్ తగ్గించి విడ్త్ పెంచాం. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఇలాంటి స్టైల్ లో ఉండే సినిమా రాలేదు. హాలీవుడ్ లో మాత్రం చాలా సినిమాలు వచ్చాయి. అక్కడ రిలీజ్ అయిన బర్డ్ మ్యాన్ అనే సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. మా హోరా హోరి రియల్ లైఫ్ డ్రామాలా ఉంటుంది. 

ఆ వాల్ ను బ్రేక్ చేసే మూవీ ఇది..

ఇప్పటివరకు రెండు రకాల సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఆర్ట్ ఫిలిం అయితే మరొకటి కమర్షియల్ ఫిలిం. హిందీలో ఆతెంటిక్  సినిమాలు వచ్చేవి. రామ్ గోపాల్ వర్మ గారి సత్య సినిమాతో వాటికి బ్రేక్ పడింది. తమిళంలో ఆర్ట్ తో పాటు ఆతెంటిక్ సినిమాలు వచ్చి విజయాలు సాధించాయి. తెలుగులో వచ్చిన శివ మూవీ చాలా నేచురల్ గా ఉంటుంది. ఆ తరువాత వచ్చిన సినిమాల్లో సుమోలు లెగడం, ఒకడు పది మందిని కొట్టడం అవన్నీ రియలిస్టిక్ గా లేకపోయినా జెనాలు చూస్తున్నారు. ఈ సినిమాతో ఆ వాల్ ను బ్రేక్ చేయాలనుకుంటున్నాను. సక్సెస్ అయితే డెఫినిట్ గా నేను అనుకున్నది సాధిస్తాను. హోరా హోరి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అయినా ఆర్ట్ మూవీ లా ప్రెజెంట్ చేసాను. 

తెలుగు సినిమాను చంపేశారు..

తెలుగు సినిమాల్లో లెంగ్త్ అనేది పెద్ద సమస్యగా మారింది. కొందరు లెంగ్త్ పిచ్చితో తెలుగు సినిమాను చంపేశారు. అసలు లెంగ్త్ కు సినిమాకు సంబంధం ఏంటి..? రామాయణం, మహాభారతం వంటి సినిమాలను రెండు గంటల్లో చెప్పగలరా..? సినిమా లెంగ్త్ ఎంత ఉండాలో కథ డిసైడ్ చేస్తుంది. లఘాన్ సినిమా మూడు గంటల 41 నిమిషాలు ఉంటే అందరు ఎంజాయ్ చేసారు కదా.. కథలో దమ్ముంటే సినిమా ఎన్ని గంటలైనా చూడొచ్చు. పోనీ రెండు గంటల్లో సినిమా చేస్తే హిట్ అవుతుందో లేదో నమ్మకం లేదు. ప్రస్తుతం అందరు కామెడీ కు కనెక్ట్ అవుతున్నారు. ఎమోషన్స్ కు ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు. లెంగ్త్ ఇస్తేనే కదా ఎమోషన్స్ కు కనెక్ట్ అయ్యేది. అవతార్ సినిమా సింగిల్ స్క్రీన్ లో 5 కోట్లు సంపాదించింది. మూడు గంటల 10 నిమిషాలైనా సినిమా చూసారు. ప్రేక్షకులు నిడివి ఎంత ఉన్నా సినిమా చూడడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా లెంగ్త్ ఉండాలి స్పీడ్ మాత్రం తగ్గకూడదు. 

ఆయన మంచి టెక్నీషియన్..

నేను పని పిచ్చోడ్ని. నాకు విశ్రాంతి కూడా పనే. నాతో పని చేసేవారు కూడా అలానే ఉండాలనుకుంటాను. అది నా తప్పు. ఆ విషయంలో కళ్యాన్ కోడూరు కు నాకు చిన్న చిన్న గొడవలు వచ్చాయి. అయినా సినిమాకు అధ్బుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి టెక్నీషియన్ ఆయన.

జయం అనవసరంగా తీశాను..

నేను ఏ సినిమా చేసిన అందరు జయం సినిమాతో పోలుస్తున్నారు. నాకు అది అసలు నచ్చట్లేదు. ఆ సినిమా తరువాత చాలా సినిమాలు చేసాను. ఆ చిత్రాలు చూసిన వారంతా జయం సినిమాలా చేయొచ్చుగా అంటున్నారు. చిత్రం, అవునన్నా కాదన్నా, నువ్వునేను, నిజం, వెయ్యి అబద్ధాలు, ఒక విచిత్రం ఇలా అన్ని రకాలా జోనర్స్ ను ట్రై చేసాను. కాని నాపై లవ్ స్టొరీ ముద్ర వేసేసారు. జయం సినిమా చూసినప్పుడల్లా ఎందుకు చేసానురా.. బాబు అనుకుంటాను. హోరా హోరి సినిమా చూస్తునప్పుడు నాకు జయం సినిమా గుర్తొచ్చింది. కానీ సినిమా చూసిన వారు మాత్రమే అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి అని చెబుతున్నారు.

అందుకే గ్యాప్ ఇచ్చాను..

మా అబ్బాయికి వచ్చిన సమస్య వలన నాలుగు సంవత్సరాలు సినిమాలకు గ్యాప్ ఇచ్చాను. ఇంక వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఒకటి చేస్తున్నా అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ