Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రేమ్ సాయి

Wed 16th Sep 2015 05:21 AM
courier boy kalyan,nithin,prem sai,gautham menon  సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రేమ్ సాయి
సినీజోష్ ఇంటర్వ్యూ-ప్రేమ్ సాయి
Advertisement
Ads by CJ

నితిన్, యామీగౌతమ్ జంటగా ఫోటాన్ కతాస్ బ్యానర్ పై ప్రేమ్ సాయి దర్శకత్వంలో గౌతమ్ మీనన్ నిర్మిస్తున్న చిత్రం కొరియర్ బాయ్ కళ్యాణ్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 17న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రేమ సాయి తో సినీజోష్ ఇంటర్వ్యూ..

మీ బ్యాక్ గ్రౌండ్ గురించి..?

కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాకు ముందు నేను ప్రభుదేవా గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. శంకర్ దాదా ఎంబిబిఎస్, అరవంలో ఓ చిత్రానికి కో డైరెక్టర్ గా పని చేసాను. అలా రెండు మూడు సినిమాలకు పని చేసిన తరువాత కొరియర్ బాయ్ కళ్యాణ్ కథ రాసుకున్నాను. 1990 లలో కొన్ని సీరియల్స్ లో నటించాను. నంది అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాను. కాని నాలో క్రియేటివిటీ ఇంట్రెస్ట్ మాత్రం పోలేదు. నటునిగా సీరియల్స్ లో నటించిన కొన్నాళ్ళకు బిగ్గర్ డ్రీమ్స్ కు అక్కడ ప్లాట్ ఫామ్ లేదనిపించింది. ఆ జోన్ నుంచి బయటకి వచ్చేసాను. కథలు రాయడం ప్రారంభించాను. యాక్టర్ గా నాకు పది సంవత్సరాల అనుభవం ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ తోనే దర్శకునిగా రాణించగలననే కాన్ఫిడెన్స్ వచ్చింది. 

ఈ సినిమా గురించి చెప్పండి..?

ప్రస్తుతం వస్తున్న సినిమాల డిక్షన్ లో కామెడీ ట్రాక్, 5 పాటలు, ఒక ఐటెం సాంగ్ ఉంటున్నాయి. కాని నేను అవి ఫాలో కాలేదు. ఫిక్స్డ్ ఫార్ములాలను నేను నమ్మను. ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. సాధారణంగా హీరో అంటే బోల్డ్ గా ఉండే క్యారెక్టర్స్ లోనే నటిస్తారు. కొరియర్ బాయ్ గా ఎవరు నటించరు. కాని మా సినిమాలో ఓ కొరియర్ బాయ్. అలానే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు ఖాది  అంటే ఏంటో తెలియదు. సినిమాలో మా హీరోయిన్ ఖాది భండార్ లో పనిచేసే ఓ సేల్స్ గర్ల్. వీళ్ళ జంట ఆడియన్స్ కు కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో నేను చెప్పబోయే పాయింట్ మీద ఇప్పటివరకు ఎలాంటి చిత్రాలు రాలేదు. సంతోషంగా, పీస్ ఫుల్ గా ఉండే ఓ కామన్ మ్యాన్ కు సమస్య వస్తే ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ కథ. 

గౌతమ్ మీనన్ గారిని ఎలా ఒప్పించారు..?

మొదట ఈ చిత్రాన్ని తమిళంలో హీరో జై కు చెప్పాను. డైరెక్టర్ గా ఇది నా మొదటి సినిమా సో.. మంచి బ్రాండ్ ఉన్న ఇనిషియల్ తో రావాలనుకున్నాను. గౌతమ్ గారిని కలిసి కథ నేరేట్ చేశాను. ఆయన కథ విన్న వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా చేద్దామని చెప్పారు. 

తెలుగు, తమిళంలో సినిమా ఒకే విధంగా ఉంటుందా..?

మొదట నేను కథ రాసుకున్నప్పుడు తమిళ నేటివిటీకు తగ్గట్లుగా రాసుకున్నాను. తెలుగులో కూడా చేయాలనేసరికి తెలుగు నేటివిటీ కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసాను. రీజనల్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. దానికి తగినట్లుగా స్టొరీ కూడా ఉండాలి.

తెలుగులో హీరోగా నితిన్ నే అనుకున్నారా..?

తెలుగులో సినిమా చేయాలనుకున్నప్పుడు హీరోగా కొంతమంది పేర్లు సజెస్ట్ చేసారు. అందులో నితిన్ పేరు కూడా ఉంది. ఇష్క్ సినిమా తరువాత ఆయన చాలా కథలు విన్నారు. అన్ని ఒకే ఫార్మాట్ లో ఉండడం వలన ఏ సినిమా ఓకే చేయలేదు. ఈ కథను నేను నేరేట్ చేయగానే కొత్తగా ఉందని ఒప్పుకున్నారు. 

సినిమా రిలీజ్ లేట్ అయింది కదా.. అవుట్ పుట్ ఎలా వస్తుందనుకుంటున్నారు..?

నేను ప్రతి విషయం మోడరేట్ గా తీసుకుంటాను. ఫిలిం మేకింగ్ చేసినప్పుడు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఎంజాయ్ చేసి వర్క్ చేసాను. నా పని నేను చేసాను. అవుట్ పుట్ గురించి ఆలోచించను. అయినా నితిన్ సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు పండగ చేసుకుంటారు. ఆడియన్స్ అంతా చాలా క్లారిటీ గా ఉన్నారు. ఫండ్స్ లేక స్టార్ హీరోల సినిమాలే లేట్ గా రిలీజ్ అవుతున్నాయి. రెండు సంవత్సరాలు చేసే సినిమాను రెండు రోజుల్లో తీసేస్తున్నారు. డిస్ట్రిబ్యూటింగ్ అనేది పక్కగా ఉండాలి. గౌతమ్, నితిన్ బ్రాండింగ్ డిస్ట్రిబ్యూషన్ లో ఉపయోగపడుతుంది. 

ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ తో పని చేయడానికి కారణం..?

మా సినిమా షూటింగ్ టైంలో యామి గౌతమ్ ఓ హిందీ సినిమా కమిట్ అయింది. నెల రోజుల్లో ఆమె షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలి. ఆ సమయంలో మ్యూజిక్ డైరెక్టర్స్ డేట్స్ కుదరలేదు. కార్తిక్ మూడు పాటలు అందించారు. నితిన్ అనూప్ తో ఒక సాంగ్ చేయిద్దామని చెప్పగానే ఆయనతో ఒక సాంగ్ చేయించాం. సందీప్ చౌహాన్ గారితో పని చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయనే అందించారు. 

ఈ సినిమా గురించి ఎలాంటి హొమ్ వర్క్ చేసారు..?

ఇదొక ఫిక్షన్ మూవీ. నాకు కామన్ మ్యాన్ స్టోరీస్ రాయడమంటే ఇష్టం. ఓ కొరియర్ బాయ్ ను ఉదాహరణగా తీసుకుంటే తను రోజంతా ఫీల్డ్ లో ఉంటాడు. రోజులో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకొని ఈ కథ ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం చెన్నైలో ప్రొఫెషనల్ కొరియర్ ఆఫీసులకు వెళ్లి కొరియర్ బాయ్స్ అందరితో మాట్లాడాను. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొంతమందికి సబ్జెక్ట్స్ చెప్పాను. కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా రిలీజ్ తరువాత అవి ఫైనల్ అవుతాయి అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ