Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-పూరిజగన్నాథ్

Mon 28th Sep 2015 05:25 AM
poori jagannath,varun tej,c.kalyan,mahesh babu  సినీజోష్ ఇంటర్వ్యూ-పూరిజగన్నాథ్
సినీజోష్ ఇంటర్వ్యూ-పూరిజగన్నాథ్
Advertisement
Ads by CJ

బద్రి, పోకిరి, దేశముదురు వంటి ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఆయన వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ ఆధ్వర్యంలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 27న పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు. 

సినిమా గురించి చెప్పండి..?

అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీ తరువాత ఆ తరహాలో తెరకెక్కిస్తున్న చిత్రమది. మంచి కుటుంబకథాచిత్రం. మదర్ సెంటిమెంట్ తో పాటు లవ్ స్టొరీ కూడా ఉంటుంది. చాలా కాలం తరువాత ఎమోషన్స్, సెంటిమెంట్ తో కూడిన సినిమాను చిత్రీకరించడం  కొత్తగా అనిపించింది. ప్రతి సీన్ బాగా వచ్చింది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. చిన్న పార్ట్ మాత్రమే మిగిలింది.  

ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ గురించి..?

వరుణ్ తేజ్ పక్కా మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. జెన్యూన్ గా నటిస్తాడు. తనలో ఇన్నోసెన్స్ ఉంటుంది. వరుణ్ ఖచ్చితంగా పెద్ద స్టార్ హీరో అవుతాడు. దిశా పటాని హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో తనకు మంచి పేరు వస్తుంది. రేవతి, పోశాని కృష్ణమురళి వరుణ్ కి తల్లితండ్రులుగా కనిపిస్తారు. సినిమాలో మథర్ సెంటిమెంట్ తో కూడిన ఓ పాట ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ్ గారు ఆ పాట కోసం తెలంగాణా భాషలో మంచి లిరిక్స్ అందించారు.

మథర్ సెంటిమెంట్ సినిమాకు లోఫర్ అనే టైటిల్ పెట్టడానికి కారణం..?

లోఫర్ అనేది కథలో భాగంగా ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. కాని సినిమాలో కొన్ని సీన్స్ చూసిన రామ్ గోపాల్ వర్మ గారు, సి.కళ్యాన్ గారు టైటిల్ మార్చమని చెబుతున్నారు. కాబట్టి ఈ మూవీ లోఫర్ టైటిల్ తో రిలీజ్ కావట్లేదు. త్వరలోనే కొత్త టైటిల్ అనౌన్స్ చేస్తాం.

రామ్ గోపాల్ వర్మ గారు ఈ సినిమా గురించి ఏం అన్నారు..?

గురువు గారికి సెంటిమెంట్స్ అంటే అసహ్యం. రిలేషన్స్ లో సెంటిమెంట్స్ అంటే అసలు నమ్మరు. కాని ఆయన ఈ సినిమా చూసి ఎమోషనల్ ఫీల్ అయ్యారు. ఆయన సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. టైటిల్ మాత్రం మార్చమని సజెస్ట్ చేసారు.

చిరంజీవి గారికి మీరు చెప్పిన కథ నచ్చలేదా..?

కథ రెడీ చేసుకొని ఆయనకు చెప్పాను. ఫస్ట్ హాఫ్ విని చాలా బావుందన్నారు. ఫుల్ స్క్రిప్ట్ విన్న తరువాత నేను కబురు చేస్తానని చెప్పారు. కాని మీడియా ముందు సెకండ్ హాఫ్ నచ్చలేదు. అందుకే పూరితో సినిమా చేయట్లేదని చెప్పారు. ఒకవేళ ఆయన నాతో చెప్పి ఉంటే మార్పులు చేసి మరోసారి వినిపించేవాడ్ని. కాని చిరంజీవి గారు మాత్రం అలా చేయలేదు.

ఎక్కువ కాలం పూరి సినిమా చేయడానికి సమయం తీసుకుంటే ఇంకా బాగా చేయగలడనే రూమర్ ఉంది. దానిపై మీ స్పందన..?

నేను స్క్రిప్ట్ కంటే టైం కి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఒక సినిమాను ఎంత కాలంలో తీస్తే సరిపోతుందో అంత వరకే తీస్తాను. అంతేకాని టైం ఎక్కువ తీసుకుంటే సినిమా బాగా చెయ్యొచ్చు అంటే మాత్రం నమ్మను. ఆ టైం లో వేరే సినిమాలు చేసుకోవచ్చు కదా..

బాహుబలి తరహా చిత్రాలు తీసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా..?

అసలు లేవు. అటువంటి సినిమాలు చూడడానికే ప్రాధాన్యత ఇస్తాను కాని తీయాలని మాత్రం ఎప్పుడు ఆలోచించలేదు.

ఈ జనరేషన్ లో 100 సినిమాలు చేయగలిగే డైరెక్ట్ మీరే అంటున్నారు. దానికి మీరేం అంటారు..?

2000 లో బద్రి సినిమాతో డైరెక్టర్ గా నా కెరీర్ ప్రారంభించాను. ఈ పదిహేను సంవత్సరాల్లో ముప్పై చిత్రాలను తెరకెక్కించాను. నా మొదటి సినిమా కళ్యాన్ గారితో చేసినప్పుడు డైరెక్టర్ గా నాకు కొత్త. ప్రొడ్యూసర్ నన్ను చూసి అసలు డైరెక్ట్ చేయగలనా అనుకున్నారు. కాని సినిమా కంప్లీట్ అయిన తరువాత నా దగ్గరకు వచ్చి నువ్వు ఖచ్చితంగా 50 సినిమాలు తీస్తావని చెప్పారు. ఆయన ఆశీస్సులతో ఇప్పటికి ముప్పై సినిమా చేసాను. మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. 

హిందీలో ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు..?

బాలీవుడ్ లో సినిమా చేసి నాలుగు సంవత్సరాలు అయింది. బుద్ధా హోగా తేరా బాప్ నా లాస్ట్ మూవీ. బహుశా నెక్స్ట్ ఇయర్ హిందీలో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.

మీరు డైరెక్ట్ చేసిన చిత్రాలలో మీకు బాగా నచ్చిన స్క్రిప్ట్స్..?

అన్నీ నచ్చే చేసాను. కాని ముఖ్యంగా ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, నేనింతే, బిజినెస్ మెన్ చిత్రాలు నాకు బాగా నచ్చుతాయి. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

బెంగుళూరు కు చెందిన ఇషాన్ అనే అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఓ లవ్ స్టొరీ చేయనున్నాను. నవంబర్ లో ఆ సినిమా మొదలవుతుంది. అది కాకుండా మహేష్ బాబు కి, అల్లు అర్జున్ కి స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.        

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ