Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-రాశి ఖన్నా

Wed 30th Sep 2015 02:45 AM
rashi khanna,ram,sreenivas reddy,sri sravanthi movies  సినీజోష్ ఇంటర్వ్యూ-రాశి ఖన్నా
సినీజోష్ ఇంటర్వ్యూ-రాశి ఖన్నా
Advertisement
Ads by CJ

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస విజయాలు సాధిస్తూ అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ల రేసులో దూసుకుపోతున్న నటి రాశి ఖన్నా. ప్రస్తుతం రాశి ఖన్నా, ఎనర్జిటిక్ స్టార్ రామ్ జంటగా నటించిన శివమ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నటి రాశి ఖన్నా తో సినీజోష్ ఇంటర్వ్యూ.. 

సినిమాలో మీ క్యారెక్టర్ గురించి..?

సినిమాలో నా పాత్ర పేరు తనూ. ఈగో ఉన్న క్యారెక్టర్ అది. నిజ జీవితంలో నేను అలా ఉండను. అందుకే పాత్ర కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. హీరో హీరోయిన్ లు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీల్లా గొడవ పడుతుంటారు. హీరోయిన్ గా నాలుగు పాటలు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే వచ్చే డమ్మీ క్యారెక్టర్ కాదు.

రామ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

రామ్ తో కలిసి వర్క్ చేయడం ఎవరికైనా ఛాలెంజింగే. రామ్ ఎనర్జీ చూస్తూంటే ఆశ్చర్యం అనిపించేది. షూటింగ్ జరిగినన్ని రోజుల్లో ఒకరోజు కూడా తను నీరసంగా కూర్చోవడం చూడలేదు. ఇక డాన్స్ విషయంలో ఎంత కష్టమైన స్టెప్ అయిన చిటికెలో నేర్చుకొని చేసేసేవాడు. తనతో డాన్స్ చేయాలంటే చాలా టెన్షన్ వచ్చేది. చాలా ఎక్కువ సమయం తీసుకొనేదాన్ని.

సినిమా సినిమాకు మీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా..?

కనిపించకపోతే నేనేం పని చేయనట్లే అర్ధం. ఈ సినిమాతో డాన్సుల్లో స్పీడ్ పెరిగింది. అదంతా రామ్ వల్లే..ఈ సినిమా ద్వారా నటన పరంగా సరికొత్త పాఠాలు తెలుసుకొన్నాను. 

హీరోయిన్ గా బాగా బిజీ అయినట్లున్నారు కదా..?

ఊహలు గుసగుసలాడే సినిమా నుండి ఈరోజు వరకు నా ప్రయాణం ఎన్నో విషయాల్ని నేర్పింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండడాన్ని ఇష్టపడతాను. ఏ నటికైనా కావాల్సింది కూడా అదే. నా పనిని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఈరోజు నా పనేంటి అనే దానిపైనే దృష్టి పెడతాను. ఇండస్ట్రీలో నా స్థానం ఏంటి.. నా నెంబర్ ఏంటి.. అనే విషయాలు పట్టించుకోను. 

మరోసారి కొత్త డైరెక్టర్ తో పని చేయడం ఎలా అనిపించింది..?

ఇప్పటివరకు నేను ఎక్కువగా కొత్త దర్శకులతోనే వర్క్ చేసాను. సీనియర్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని నాకూ ఉంటుంది. ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా కొత్త వారే. ఆయన సినిమాను హ్యాండిల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది.

స్క్రీన్ పై బాగా కనిపించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?

కాస్ట్యూమ్స్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. నా పర్సనల్ స్టైలిష్ట్ దీప్తిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. చాలా అప్ డేటెడ్ గా ఉంటుంది. ఈ సినిమాలో ఓ పాటలో సిగరెట్ ప్యాంట్ వేసుకున్నాను. అదేంటో తెరపైనే చూడాలి. 

తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి కారణం..?

ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించాను. నా మొదటి సినిమాలో అవకాశం రావడం అధ్రుష్టమనే చెప్పాలి. ఆ తరువాత నా టాలెంట్ వలనే అవకాశాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాలతోనే స్టార్ లీగ్ లో స్థానం సంపాదించుకోగలిగాను. పోటీ తత్వం వల్లే అది సాధ్యమైంది.

తెలుగు నేర్చుకున్నట్లున్నారు..?

ఊహలు గుసగుసలాడే సినిమాలో నాకు చాలా డైలాగ్స్ ఉండేవి. లిప్ సింక్ కుదరడం కోసమని అప్పుడు తెలుగు నేర్చుకొన్నాను. ఇప్పుడు అది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా సెట్స్ లో అందరితో తెలుగులోనే మాట్లాడుతుంటాను.  

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ప్రస్తుతం రవితేజతో బెంగాల్ టైగర్, సాయిధరమ్ తేజ్ తో సుప్రీమ్ చిత్రాల్లో నటిస్తున్నాను. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ లో ఉన్నాయంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ