Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-అల్లు అర్జున్

Thu 08th Oct 2015 04:55 AM
rudhramadevi,anushka,rana,allu arjun interview  సినీజోష్ ఇంటర్వ్యూ-అల్లు అర్జున్
సినీజోష్ ఇంటర్వ్యూ-అల్లు అర్జున్
Advertisement
Ads by CJ

గుణ టీమ్‌ వర్క్స్‌ పతాకంపై డైనమిక్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ స్వీయనిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రం ఈనెల 9న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించారు. సినిమా రిలీజ్‌ సందర్భంగా బన్ని గీతా ఆర్ట్స్‌ కార్యాలయంలో సినిమా గురించి మాట్లాడారు. ఆ విశేషాలివి... 

రుద్రమదేవి రిలీజవుతోంది... ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోందా? 

తెలుగు సినిమాకి ఇదో కొత్త జోనర్‌. హిస్టారిక్‌, బయోగ్రాఫిక్‌ జోనర్‌ ఫిలిం ఇది. బయో ఎపిక్‌ అనాలి. ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్‌ చేస్తారు అన్న క్యూరియాసిటీ ఉంది. 

మీ రాకతోనే ప్రాజెక్టు స్థాయి పెరిగింది అనుకోవచ్చా? 

నేను ఔటాఫ్‌ ది వే వెళ్లి ఆ క్యారెక్టర్‌ చేశా. నేనేం చేసినా నా ఇంటెన్షన్‌ మంచి కోసమే. మన తెలుగు కల్చర్‌ గురించి చెప్పే సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే మంచి ఇంటెన్షన్‌తో చేశాను. 

మీ అంతట మీరుగానే గుణశేఖర్‌ని కలిసి నటిస్తానని అడిగారుట కదా? 

నేను రెగ్యులర్‌గానే గుణశేఖర్‌గారిని కలుస్తుంటాను. ఆ సందర్భంలోనే రుద్రమదేవి కథ చెప్పారు. షూటింగ్‌ అంతా అయిపోయింది. కానీ గోనగన్నారెడ్డి క్యారెక్టర్‌ వేరే ఎవరూ చేయలేదు.. అని అనుకుంటున్న టైమ్‌లో నేనే వెళ్లాను. ఆ పాత్రను నాకు తగ్గట్టుగా మార్చుకోగలిగితే చేస్తానని అన్నా. ఆయన చాలా హ్యాపీ ఫీలై, ఆ క్యారెక్టర్‌ని తీర్చిదిద్దారు. 

ఎవరూ చేయలేదు.. అన్న డైలమాలో ఉన్నపుడు మీరే ఎందుకు చేశారు? 

గుణశేఖర్‌ మన తెలుగు కల్చర్‌కి సంబంధించిన ఓ చక్కని సినిమా చేస్తున్నారు. అలాంటి సినిమాకి ఎవరూ సపోర్ట్‌ చేయడం లేదు ఏంటి? అని నేను ఫీలై ముందుకు వచ్చాను. అలాగే ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది నచ్చింది. ఇంత ప్యాషనేట్‌గా ఆయన చేస్తున్న ప్రయత్నం ఆకట్టుకుంది. అందుకే నేను మనస్ఫూర్తిగా ఫీలై చేశాను. అన్నీ మనీ లెక్కలే వేయకూడదు. అందుకే నేను నటించాను. 

మీరు చేసింది కరెక్టే అన్న గట్‌ ఫీలింగ్‌ ఎప్పుడు కలిగింది? 

ఇందులోకి ఓ మంచి ఇంటెన్షన్‌తో దిగాను. నిజానికి ఒరిజినల్‌గా గోనగన్నారెడ్డి క్యారెక్టరైజేషన్‌ నాకోసం రాసినది కాదు. వేరే ఏజ్‌ గ్రూప్‌కి రాసుకున్నది. నేనొక యంగ్‌ హీరోని. నాకు తగ్గట్టే ఆ క్యారెక్టర్‌ని మార్చాలి. డైలాగ్స్‌ సహా అన్నీ రెడీ అయ్యాక నాకు వ్యక్తిగతంగా కిక్కిచ్చింది. ఇతనికి సూటవ్వుద్దా? అనే లెవల్‌ నుంచి ఇతనికే సూటవ్వుద్ది అనే లెవల్‌కి క్యారెక్టర్‌ని మలిచారు. నేనే చేయాలి అనిపించేలా మార్చారు. 

గోనగన్నారెడ్డి ఏజ్డ్‌ అని అంటున్నారు.. మరి అలాంటప్పుడు యంగ్‌ హీరో యాప్ట్‌ కాదు కదా? 

రామాయణంని బాలరామాయణంగా బాల నటీనటులతో తీసిన అనుభవజ్ఞుడు గుణశేఖర్‌. అందుకే రుద్రమదేవి చిత్రంలో పాత్రలన్నిటినీ యంగ్‌ పీపుల్‌తోనే తెరకెక్కించారు. నేను, రానా, క్యాథరిన్‌, నిత్యా అన్నీ యంగ్‌ క్యారెక్టర్లే. 

హిస్టారికల్‌ అనగానే క్యారెక్టర్ల ఔట్‌ఫిట్‌ ఎలా? ముందే ప్రిపరేషన్‌ ఎలా చేశారు? 

రుద్రమదేవికి రిఫరెన్స్‌ పిక్చర్స్‌ ఏవీ లేవు. గోనగన్నారెడ్డి అనే క్యారెక్టర్‌ ఉంది తప్ప రిఫరెన్స్‌ పిక్చర్స్‌ ఏవీ లేవు. 16వ శతాబ్ధం నుంచి పెయింటింగ్స్‌ ఏవీ అందుబాటులో లేవు. గోనగన్నారెడ్డి అనగానే పాపులర్‌ దొంగ. ఓ రాబిన్‌హుడ్‌ తరహా క్యారెక్టర్‌. ఇతనికి నల్లని డ్రెస్‌ ఔట్‌ఫిట్‌ కావాలి. రఫ్‌గా ఉంటాడు. చినిపోయిన బట్టలు ఉంటాయి అని డిజైన్‌ చేసుకున్నాం. దొంగ ఇలా ఉంటాడు అని సైకలాజికల్‌ ఫీలింగ్‌తో రీసెర్చ్‌ చేశాం. 

కానీ హెయిర్‌ స్టయిల్‌ మోడ్రన్‌గానే ఉంది? అప్పట్లో లాంగ్‌ హెయిర్‌ ఉండేది! 

అందుకు కథలో కూడా రీజన్‌ ఉంది. అప్పట్లో లాంగ్‌ హెయిర్‌ లేని వాళ్లకు బుర్ర సుంకం అని పన్ను వేసేవారు. అందుకే పొడవాటి గిరజాలతో కనిపించేవారు. కానీ ఇందులో గన్నారెడ్డి రెబల్‌ క్యారెక్టర్‌. పొట్టి హెయిర్‌తో ఇలానే ఉంటాను అని ఎదిరించే విప్లవకారుడు. అందుకే ఆ హెయిర్‌తో కనిపించాడు. ఇది నా ఇంటర్‌ ప్రెటేషన్‌. 

ఓ మంచి ఆలోచనతో ఈ పాత్ర చేశారు? వెనక్కి లాగినవాళ్లు ఉంటారు కదా! 

ఎందుకు ఈ క్యారెక్టర్‌ చేయడం అవసరమా? హీరోగా చేసేప్పుడు అని వెనక్కి లాగారు చాలామంది. కానీ నేను ఈక్యారెక్టర్‌ చేయడానికి కారణం ఆరోజుల్లో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ హీరోలుగా ఉంటూనే ఇలాంటి మంచి క్యారెక్టర్లు వచ్చినప్పుడు చేసేవారు. ఎన్టీఆర్‌గారు 200వ సినిమాకి కూడా ఓ క్యారెక్టర్‌ చేసేశారు. అప్పట్లో ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా మంచి క్యారెక్టర్లకు విలువనిచ్చేవారు. హాలీవుడ్‌లో బ్రాడ్‌ ఫిట్‌ లాంటివాళ్లు అలానే చేస్తున్నారు. నిత్యామీనన్‌ కూడా పాత్ర నచ్చితేనే రెడీ అంటుంది. నేను నటిని. మంచి పాత్రలు ఏవి వచ్చినా చేస్తానని ముందుంటుంది. 

రానా, మీరు ఫ్రెండ్సు కాబట్టి కలిసి నటించారా? 

ఈ చిత్రంలో రానాకి నాకు కాంబినేషన్‌ సీన్స్‌ ఏవీ లేవు. ఒక సీన్‌ తప్ప.. మేం ఫ్రెండ్సే కదా.. అని చేసిందేం లేదు. ఆ అవసరం రాలేదు. 

మీ పాత్ర భాష, యాస ఎలా ఉంటుంది? 

గోన గన్నారెడ్డికి కొంత రాయలసీమ, కొంత పాలమూరు ప్రాంతాలతో టచ్‌ ఉంది. అయితే ఎక్కువ తెలంగాణతో టచ్‌ ఉన్న మనిషి. అరదుకే తెలంగాణ యాస ఉండాలని అనుకున్నాం. అయితే తెలంగాణ యాస అన్నిచోట్లా అర్థం కాదు. అందుకే అందరికీ అర్థమయ్యేలా ఆ పాత్రతో మాట్లాడించారు. తెలంగాణం మాట్లాడితే ప్రత్యేకత ఉంటుందని భావించాం. రెగ్యులర్‌ భాషనే తెలంగాణ భాషలో రాయిస్తే చాలా బ్యూటీ వచ్చింది. చారిత్రకం కాబట్టి కొంత గ్రాంధికం ఉండాలి. కానీ దొంగ, బందిపోటు కాబట్టి గ్రాంధికం తీసేయొచ్చు అనుకున్నాం. కొంత కలోకియల్‌ భాష మాట్లాడించాం. కలోకియల్‌ తెలంగాణ భాష వినిపిస్తుంది. 

రుద్రమదేవి తెలుగు రాణి, ఇతర భాషల్లో ఎందుకు చూడాలి? 

రుద్రమదేవి కథ తెలుగుకే పరిమితం కాదు. తమిళనాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర అన్నిటినీ కలుపుకుని సామ్రాజ్యం విస్తరించి ఉంది. అందులో వరంగల్‌ రాజధానిగా పరిపాలించింది. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌పై సినిమా ఇది. ఆడాళ్లు ఎందుకు రూల్‌ చేయకూడదు? అనేది యూనివర్శల్‌ పాయింట్‌. ఆరోజుల్లో ఒక లేడీ పరిపాలన అంటే ఎలాంటి అభ్యంతరాలు ఉంటాయి? అన్నదే సినిమా. అందుకే ఏ భాషలో అయినా చూడొచ్చు. 

మీ క్యారెక్టర్‌ విషయమై చిరు మీకు ఏం సలహా ఇచ్చారు? 

సలహా ఏం లేదు. ఇందులో ఓ క్యారెక్టర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఓ వాయిస్‌ వినిపించాల్సిన అవసరం ఉంది. ఆ వాయిస్‌ ఓవర్‌ ఎవరు చెబితే బావుంటుందని గుణశేఖర్‌ ఆలోచిస్తుంటే చిరంజీవి గారు అయితే బావుంటుందని నేనే చెప్పాను. ఒక హిస్టారికల్‌ సినిమాకి ఆయన వాయిస్‌ అయితే బావుంటుందని అన్నాను. ఆయన చిరుని అడగగానే ఓకే చేసేశారు. 

బాహుబలి తర్వాత ఇలాంటి చారిత్రక కథాంశంలో మీరు భాగం అవ్వడం అదృష్టం అనుకోవచ్చా? 

బాహుబలిని దీనిని పక్కన పక్కన పెట్టి చూస్తున్నారు. ఎటాచ్‌ చేస్తున్నారు. కానీ అది జానపదం, రుద్రమదేవి హిస్టారికల్‌. అప్పట్లో రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణం రాజుగారు.. వాళ్లు క్యారెక్టర్‌ చేస్తే అలా గుర్తుండిపోయేవి. శ్రీకృష్నుడు, అల్లూరి సీతారామరాజు, తాండ్ర పాపారాయుడు .. అలా గుర్తుండిపోయే పాత్ర గోనగన్నారెడ్డి. 

బాహుబలి, శ్రీమంతుడు తర్వాత మీరు గమనించిన మార్పు? 

బాహుబలి, శ్రీమంతుడు, సినిమా చూపిస్త మావ, భలే భలే మగాడివోయ్‌, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ అన్నీ మంచి సినిమాలొస్తున్నాయి. విజయాలు సాధిస్తున్నాయి. ఇది మంచి సీజన్‌. 

వరుసగా పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి.. పోటీలో రిలీజ్‌ మంచిదేనా? 

సినిమా బావుంటే నాలుగైదు సినిమాలు ఒకేసారి రిలీజైనా ఆడుతాయి. 

సన్నాఫ్‌ సత్యమూర్తి షూటింగ్‌ టైమ్‌లో గోనగన్నారెడ్డి ఆఫర్‌ వచ్చిందని విన్నాం! 

అవును నెలరోజుల్లో సన్నాఫ్‌ సత్యమూర్తి మొదలవుతుంది అనగా ఈ అవకాశం వచ్చింది.. ఏం చేయమంటారు? అని త్రివిక్రమ్‌ని అడిగాను. ఆయన బాగా ఎంకరేజ్‌ చేశారు. 

ఇతర మార్కెట్లను కలుపుకునే సినిమాలు చేయరా? బాలీవుడ్‌ వెళ్లరా? 

భవిష్యత్‌లో బాలీవుడ్‌, సౌత్‌ కలిపి సినిమాలు వస్తాయి. పాన్‌ ఇండియన్‌ సినిమాలు తెరకెక్కుతాయి. అయితే బాలీవుడ్‌కి వెళ్లి లాంగ్‌ రన్‌లో కొట్టేయడం అంటే కుదరదు. ఇలా వెళ్లి అలా రావడమే. టాలీవుడ్‌ వదిలేసి వెళ్లి అక్కడ సినిమాలు చేయాలనుకుంటేనే వెళ్లాలి. కానీ అది కుదరదు. ఇక్కడ సాధించింది అంతా విడిచిపెట్టి వెళ్లలేం. మన హీరోలంతా అక్కడికి వెళ్లి మంచి సినిమాలు చేశారు. కానీ ఇక్కడే ఫోకస్‌ పెట్టారు. 

చిరు 150వ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారా? 

చాలా ఉత్సాహంగా వెయిట్‌ చేస్తున్నా. 

మీ ఇంట్లోనే బోలెడంత కాంపిటీషన్‌? 

మంచిదేగా, పోటీ స్పిరిట్‌ ఉండాల్సిందే. 

20ఏళ్ల తర్వాత బన్ని? 

40 ఏళ్ల తర్వాత కూడా మంచి నటులు కావాలి. 

ముంబై విలన్లను, ఇతర భాషల నటుల్ని తెచ్చుకుంటున్నాం అని మనవాళ్లు విమర్శిస్తున్నారు? 

అది కొంతవరకూ కరెక్టే. కానీ కొన్ని క్యారెక్టర్లు వాళ్లే చేయాలి. పైగా వాళ్లకు ఉన్న ఫిజికల్‌గా స్ట్రక్చర్‌ మనకు ఉండదు. అయితే మన తెలుగు నటీనటులకు ప్రోత్సాహం కావాలి. నా వంతుగా కొంత ప్రయత్నిస్తున్నా. కుదిరితే తెలుగువాళ్లను పెట్టుకుందాం అని అంటున్నా. 

భవిష్యత్‌ సినిమా ఎలా ఉండాలి? 

న్యూ ఏజ్‌ సినిమాలు తీయాలి. రుద్రమదేవి ఆ తరహా సినిమానే. ఈనెల 9న రిలీజ్‌కి వస్తున్న రుద్రమదేవి చిత్రాన్ని 3డిలో చూసి ఆస్వాధించండి. ఓ అద్భుతమైన హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ సినిమాని చూసి ఎంజాయ్‌ చేయండి అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ