Advertisementt

కెవిన్ డాన్స్ & ఫిట్ నెస్ స్టూడియో ప్రారంభం!

Sun 11th Oct 2015 06:30 AM
kevin dance and fitness studio,surendar reddy,sivabalaji,kevin  కెవిన్ డాన్స్ & ఫిట్ నెస్ స్టూడియో ప్రారంభం!
కెవిన్ డాన్స్ & ఫిట్ నెస్ స్టూడియో ప్రారంభం!
Advertisement
Ads by CJ

స్వతహాగా డాన్స్ మాస్టర్ అయిన కెవిన్ మానసికోల్లాసంతో పాటు చక్కని శరీరాకృతిని అందించే ఫిట్ నెస్ లో ప్రొఫెషనల్ ట్రయినర్ గా మారి బంజారాహిల్స్ లో గత సంవత్సరం కెవిన్ డాన్స్ అండ్ ఫిట్ నెస్ స్టూడియో ప్రారంభించారు. దీనికి బ్రాంచ్ గా శనివారం హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో మరో డాన్స్ స్టూడియో ను ఏర్పాటు చేసారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి చేతుల మీదుగా స్టూడియో ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా..

సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కెవిన్ తో నాకు చాలా రోజులుగా మంచి పరిచయం ఉంది. ఇంతకముందే తను నా సినిమాలో డాన్స్ మాస్టర్ గా చేయాల్సింది కాని కుదరలేదు. కాని నా నెక్స్ట్ సినిమాలో ఖచ్చితంగా తనకు ఓ సాంగ్ ను కోరియోగ్రఫీ చేసే అవకాశం ఇస్తాను.. అని చెప్పారు.

నటుడు శివబాలాజీ మాట్లాడుతూ.. కెవిన్ నాకొక మంచి స్నేహితుడు. మేమిద్దరం కలిసి ఓ సినిమాకు పని చేసాం. గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి. మంచి మనిషి కూడా. తను ఈరోజు డాన్స్ స్టూడియో మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. నా తరపు నుంచి తనకు కావాల్సిన సహాయసహకారాలు అందిస్తాను.. అని చెప్పారు.

డైరెక్టర్ డాలీ మాట్లాడుతూ.. కెవిన్ గురించి చాలా విన్నాను. ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు. తన డాన్స్ స్కూల్ ద్వారా ఇండస్ట్రీ కి మంచి డాన్సర్స్ ను పరిచయం చేస్తాడని భావిస్తున్నాను.. అని చెప్పారు.

కెవిన్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల క్రితం శ్రీనగర్ కాలనీ లో ఓ డాన్స్ స్కూల్ మొదలు పెట్టాను. దానిని కూడా సురేందర్ రెడ్డి గారే ప్రారంభించారు. గత ఏడాది బంజారాహిల్స్ లో కెవిన్ డాన్స్ అండ్ ఫిట్ నెస్ స్టూడియో ప్రారంభించాను. దానికి కొద్ది రోజుల్లోనే అన్ని వర్గాల వారి నుంచీ విశేష ఆదరణ లభించింది. ఫిలిం నగర్, మణికొండ, జూబిలీహిల్స్ నుండే కాకుండా వివిధ ఏరియాల నుండి మాకు చాలా కాల్స్ వచ్చాయి. దగ్గరలో బ్రాంచీ పెట్టండి అంటూ.. చాలా మంది అడిగారు. సో.. ఫిట్ నెస్ సాధించాలనుకునే వారికి మరింత చేరువయ్యేందుకు ఈ నూతన బ్రాంచీ ను ప్రారంభించాం.. అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ