Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-సుమంత్ అశ్విన్

Tue 20th Oct 2015 10:02 AM
columbus movie,sumanth ashwin interview,ramesh samala  సినీజోష్ ఇంటర్వ్యూ-సుమంత్ అశ్విన్
సినీజోష్ ఇంటర్వ్యూ-సుమంత్ అశ్విన్
Advertisement
Ads by CJ

సుమంత్ అశ్విన్, సీరత్ కపూర్, మిస్టీ చక్రవర్తి ప్రధానపాత్రల్లో ఏ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశ్వని కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న చిత్రం కొలంబస్. ఆర్.సామల దర్శకుడు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ అశ్విన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తా..

ఈ సినిమాలో ఓ అమ్మాయిని నిజాయితీగా ప్రేమించే ఓ కుర్రాడి పాత్రలో కనిపిస్తాను. జైలులో ఉంటూ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఓ సాఫ్ట్ వేర్ కంపనీ లో పని చేసే అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు. చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేదే ఈ సినిమా కథ. ఇది ట్రైయాంగల్ లవ్ స్టొరీ కాదు. ఓ ప్రేమ కథను డిఫైన్ చేయడమంటే చాలా కష్టం. అందుకే కొలంబస్ అనే టైటిల్ పెట్టాం. 

నన్ను నేను మర్చిపోయా..

మొదట నుండి ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. థియేటర్ లో కూర్చొని ఈ సినిమా చూస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయాను. సినిమాలో మంచి ఫ్లో ఉంటుంది. మనసంతా నువ్వే, నువ్వే కావాలి చిత్రాల తరువాత ఆ లిస్టు లోకి ఖచ్చితంగా కొలంబస్ చేరుతుంది. 

విలన్ గా చేయాలనుంది..

నటుడు అనేవాడు ఒక ఇమేజ్ కు స్టిక్ అయ్యి ఉండకూడదు. అన్ని రకాల పత్రాలు చేయగలిగేలా ఉండాలి. నాకు విలన్ గా కూడా చేయాలనుంది. కాని నా శరీరం, వయస్సు దృష్టిలో పెట్టుకొని ప్రేమకథలు చేయమని ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ వయసులోనే లవ్ స్టోరీస్ చేయగలను. ఓ ఐదారు సంవత్సరాల తరువాత చేయమన్నా.. చేసే పరిస్థితి ఉండదేమో. 

ఆయన మంచి రచయిత..

ఈ స్క్రిప్ట్ నాకు రెండు మూడు సంవత్సరాలుగా తెలుసు. స్టొరీ, స్క్రీన్ ప్లే నాన్న గారిదే. రమేష్ సామల గారు డైరెక్ట్ చేసారు. ఆయన మంచి రైటర్. రచయిత దర్శకునిగా మారితే సినిమాకు చాలా హెల్ప్ అవుతుంది. మాకు కూడా ఆయన డైరెక్టర్ గా చేయడం బాగా హెల్ప్ అయింది. 

ప్రయోగాత్మక చిత్రాలంటే ఇష్టం..

వ్యక్తిగతంగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలంటే ఇష్టం. కాని కెరీర్ మొదట్లోనే ఎక్స్ పెరిమెంట్స్ చేయలేను. ఆడియన్స్ కు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో.. దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎంటర్టైన్మెంట్ తో పాటు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో.. లేవో.. చూసుకుంటాను. 

ఫెయిల్యూర్ వస్తే క్రుంగిపోతా..

నటునిగా నా లైఫ్ పెట్టి సినిమాలో నటిస్తాను. స్నేహితులు, కుటుంబం, ఫోన్ ఇలా ఏ విషయాలు పట్టించుకోను. సినిమా మీద మొత్తం ఫోకస్ పెట్టి చేస్తాను. ఒకటి రెండు సంవత్సరాలు కష్టపడి చేసిన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదని తెలిస్తే క్రుంగిపోతాను. హార్ట్ బ్రేక్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.

దిల్ రాజు గారు ఒక మాట చెప్పారు..

నిర్మాత కొడుకుగా బడ్జెట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటాను. కేరింత షూటింగ్ టైం లో దిల్ రాజు గారు ఒక నిమిషం లేట్ అయితే వెయ్యి రూపాయలు నష్టమొస్తుందని చెప్పారు. ఆ మాట ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాను. సెట్స్ కి టైం కు వెళ్తాను. నా దృష్టిలో సక్సెస్ అంటే ప్రేక్షకులకు సినిమా నచ్చి, నిర్మాతకు లాభాలు రావడమే. 

జై అనే పిలిచేవారు..

కేరింత సినిమాలో నటించిన తరువాత ఏమైనా ఊరుకి వెళ్తే జై అన్న అనే పిలిచేవారు. స్క్రీన్ స్పేస్ ఎంత ఉంది.. నాది లీడ్ రోల్ అవునా.. కాదా.. అని చూడను. స్క్రిప్ట్ నచ్చితే సినిమా చేస్తాను. భవిష్యత్తులో కూడా కేరింత లాంటి మరిన్ని సినిమాలు చేస్తాను.

ఇద్దరు అందంగా ఉంటారు.. 

ఇద్దరు హీరోయిన్స్ సీరత్ కపూర్, మిస్టీ చక్రవర్తి సినిమాలో చాలా అందంగా ఉంటారు. హీరోయిన్ సంగతి పక్కన పెడితే వాళ్ళ పాత్రను చక్కగా క్యారీ చేసారు.

సొంత బ్యానర్ లో చేయాలి..

మా సొంత ప్రొడక్షన్ లో ఒకటి లేదా రెండు సినిమాల తరువాత సినిమా చేయాలనుకుంటున్నాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతం రైట్ రైట్ అనే సినిమా ఓకే చేసాను. హిస్టరీ, థ్రిల్లర్ జోనర్ లో ఉండే చిత్రమది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ