Advertisementt

బర్త్ డే స్పెషల్: ఆది పినిశెట్టి!

Sun 13th Dec 2015 05:22 PM
aadi pinisetty interview,malupu movie,birthday special  బర్త్ డే స్పెషల్: ఆది పినిశెట్టి!
బర్త్ డే స్పెషల్: ఆది పినిశెట్టి!
Advertisement
Ads by CJ

'ఒక v చిత్రం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి 'వైశాలి','గుండెల్లో గోదారి' వంటి డిఫరెంట్ సినిమాల్లో నటించిన హీరో ఆది పినిశెట్టి. త్వరలో ఆది హీరోగా నటించిన 'మలుపు' సినిమా రిలీజ్ కానుంది. డిశంబర్ 14న ఆయన పుట్టినరోజు సందర్భంగా 'మలుపు' చిత్ర విశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు. 

సస్పెన్స్, థ్రిల్లింగ్ గా సాగే స్క్రిప్ట్..

ఈ సినిమా కథ నలుగురు స్నేహితులతో ముడిపడి ఉంటుంది. ఆ నలుగురు చదువు పూర్తి చేసుకున్న రోజు నుండి ఈ కథ మొదలవుతుంది.  డిశంబర్ 31 రాత్రి జరిగిన ఓ సంఘటన వలన వారి జీవితాలు ఏ విధంగా మారుతాయో అనేదే ఈ సినిమా కథ. సస్పెన్స్, థ్రిల్లింగ్ గా సాగే స్క్రిప్ట్. నేను ఇంతకముందు నటించిన సినిమాలకు ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది 

సినిమా డిలే అవ్వడానికి కారణం అదే..

ఈ చిత్రాన్ని సుమారుగా 240 లోకేషన్స్ లో షూట్ చేశాం. పాండిచ్చేరి, చెన్నై, వైజాగ్, బొంబాయి, గోవా ఇలా చాలా ప్రాంతాల్లో షూట్ చేశాం. మా ప్రొడక్షన్ లో ఇది మొదటి సినిమా. ఇలా కొన్ని కొన్ని కారణాల వలన లేట్ అయింది.

తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశాం..

సినిమా షూటింగ్ తెలుగు, తమిళంలో ఒకేసారి చేశాం. తెలుగు నేటివిటీకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేశాం. తమిళంలో రెండున్నర గంటల నిడివి గల ఈ చిత్రం తెలుగులో రెండు గంటలు మాత్రమే ఉంటుంది. తెలుగులో సినిమా స్పీడ్ గా ఉండేలా చూసుకున్నాం.

అన్నయ్య మరో నాన్న..

ఈ సినిమా డైరెక్టర్ మా అన్నయ్య. తనకిది మొదటి సినిమా. నాన్నగారు కథ విని బావుందని చెప్పారు. కాని దర్శకత్వంలో అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒకవేళ ఇన్వాల్వ్  అయినా.. అన్నయ్య వినడు. ఎందుకంటే అన్నయ్య మరో నాన్న. మొదటిసారి డైరెక్ట్ చేసే దర్శకునికి కావాల్సిన అన్ని నాన్నగారు అన్నయ్యకు సమకూర్చారు. సుమారుగా ఈ సినిమా 90 నుండి 200 రోజులు మధ్య షూట్ చేశాం.

'గోపాల గోపాల'కు ముందే ఓకే చేసారు..

మా అన్నయ్య స్నేహితులకు జరిగిన ఓ యదార్థ సంఘటనను ఆధారంగా చేసుకొని ఈ సినిమా ప్లాన్ చేశాడు.ఇందులో మిథున్ చక్రవర్తి గారు బొంబాయిలో ఉండే ఓ రియల్ క్యారెక్టర్ ప్లే చేసారు. సౌత్ సినిమాల్లో ఆయన నటించరు. కాని ఈ సినిమా కథ విని వెంటనే ఓకే చేసారు. 'గోపాల గోపాల' సినిమాకు ముందే మా సినిమా ఒప్పుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఓ ఫ్రెష్ ఫేస్ కావాలని ఆయనను ఎన్నుకున్నాం.

స్టైలిష్ గా కనిపిస్తా..

కాలేజ్ స్టూడెంట్ పాత్ర కాబట్టి సినిమాలో స్టైలిష్ కనిపించడానికి ప్రయత్నించాను. 4 నుండి 5 కిలోల బరువు తగ్గాను. కాస్ట్యూమ్స్, మేకప్ విషయాల్లో కేర్ తీసుకున్నాను. బాగా కనిపించాలని కాస్త ఎఫర్ట్ పెట్టాను.

'మలుపు' తరువాత అలాంటి స్క్రిప్ట్స్ చేస్తా..

'మలుపు' సినిమా తరువాత కమర్షియల్ గా ఉంటూ.. కొత్తగా అనిపించే సినిమాల్లో నటిస్తాను. 'మలుపు' సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. నేను పుట్టింది గుంటూరులో.. పెరిగింది మాత్రం చెన్నైలో అందుకే అనుకుంట అక్కడ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. తెలుగు సినిమాలు చేయకూడదని కాదు. 

'సరైనోడు' లో విలన్ పాత్ర..

బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తోన్న 'సరైనోడు' చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నాను. బోయపాటి గారి సినిమాల్లో విలన్స్ కు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ విలన్ లా కాకుండా స్లీక్ గా ఉండే విలన్ క్యారెక్టర్. నటునిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నేను హీరోగా మాత్రమే చూడాలనుకోను. పాత్ర నచ్చితే నటిస్తాను.

నటుడు అవ్వాలనుకోలేదు..

చిన్నప్పటి నుండి హీరో అవ్వాలనే ఆలోచన నాకు లేదు. అలా అయితే పెద్ద చదువులకు వెళ్ళేవాడిని కాదు. నేనొక దైలామాలో ఉన్నప్పుడు ఒక v చిత్రం సినిమా చేశాను. ఆ తరువాత స్ట్రాంగ్ ఫిక్స్ అయ్యి ఇదే ఫీల్డ్ లో కంటిన్యూ చేస్తున్నాను. 

పుట్టినరోజు జరుపుకోవట్లేదు..

ప్రతి సంవత్సరం ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటాను. కాని ఈ సారి ఆ మొత్తమంతా చెన్నై వరద బాధితులకు పంపిస్తున్నాను. నా స్నేహితులు కొంతమంది అక్కడ సహాయం అందిస్తున్నారు. నా సహకారం కూడా అందిస్తున్నాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. తెలుగులో స్క్రిప్ట్స్ వింటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ