Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: సుదీర్ బాబు!

Thu 24th Dec 2015 09:45 PM
sudheer babu interview,bhale manchi roju,sriram adithya,shasi,vijay  సినీజోష్ ఇంటర్వ్యూ: సుదీర్ బాబు!
సినీజోష్ ఇంటర్వ్యూ: సుదీర్ బాబు!
Advertisement
Ads by CJ

ఎస్.ఎం.ఎస్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా పరిచయమయిన నటుడు సుధీర్ బాబు. 'ప్రేమ కథా చిత్రం' తో సక్సెస్ ను సాధించి 'ఆడు మగాడ్ర బుజ్జి' , 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటించిన 'భలే మంచి రోజు' సినిమా డిశంబర్ 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబుతో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా గురించి చెప్పండి..?

ఒక అబ్బాయి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తరువాత  ఎలాంటి వ్యక్తులను కలుస్తాడు. ఆ వ్యక్తుల వలన తన లైఫ్ ఎలా టర్న్ అయిందనేదే ఈ సినిమా. ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఓ కథ ఇది. ప్రతి సీన్ డిఫరెంట్ లొకేషన్ లో షూట్ చేశాం. ఈ సినిమాలో బెంజ్ షో రూం లో పని చేసే ఓ అబ్బాయిగా కనిపిస్తాను. ఏ బాయ్ నెక్స్ట్ టు ద గర్ల్ క్యారెక్టర్. 'భలే మంచి రోజు' హీరో లైఫ్ లో వస్తుంది.

మహేష్ బాబు ఆడియో ఫంక్షన్ లో సుధీర్ ఈ సినిమాతో స్టార్ హీరో అవుతాడని చెప్పారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు..?

చాలా సంతోషంగా అనిపించింది. మహేష్ బాబు కు నా మీద ఉన్న నమ్మకంతో అలా చెప్పాడు. నా దృష్టిలో నాలుగు నుండి ఐదు సినిమాలు వరుసగా హిట్స్ కొడితే స్టార్ హీరో అవుతారని నా నమ్మకం. ఈ సినిమా కథకు ఎస్టాబ్లిష్డ్ హీరోలు, కమెడియన్స్ , విలన్స్ అక్కర్లేదు. మంచి ఆర్టిస్ట్స్ కావాలి అంతే.. సినిమాలో అంతా ఫన్ ఉంటుంది. ఈ సినిమాపై నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఏ సినిమాకు ఇంత కాన్ఫిడెన్స్ తో లేను. ప్రేమ కథా చిత్రం సినిమాకు కూడా కొంచెం టెన్షన్ పడ్డాను. కాని ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో కామెడీ సినిమాలు చేయోచ్చనే నమ్మకం కలిగింది. 

డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య గురించి చెప్పండి..?

ఈ సినిమాతో శ్రీరామ్ ఆదిత్య పేరు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంటుంది. తనొక వండర్ కిడ్ అనొచ్చు. ఇప్పటివరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎవరి దగ్గర పని చేయలేదు. సెల్ఫ్ మేడ్ పెర్సన్. సినిమా అవుట్ పుట్ చూసాక చాలా సంతోషంగా అనిపించింది. కొత్త దర్శకులకు అవకాసం ఇవ్వడం అనేది రిస్క్. కాని కొత్త వాళ్ళే ఫ్రెష్ స్టోరీస్ చెబుతున్నారు. పెద్ద పెద్ద దర్శకులు కూడా ఈ సినిమా కథ నేరేట్ చేసేప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటనేది..? ఊహించలేకపోయారు. అంతేకాకుండా శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చూశాను. మనుషులు లేకుండా కుర్చీలు, బల్లలు, ఫ్యాన్స్ ఉపయోగించి ఓ సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా చేశాడు. అది చూసి ఈ సినిమాకు తనతో కలిసి పని చేయడానికి ఒప్పుకున్నాను. కొత్త దర్శకులకు అనుభవం ఉన్న టెక్నీషియన్స్ ను ప్యాకేజ్డ్ గా ఇస్తే వాళ్లకు హెల్ప్ ఫుల్ గా ఉంటుంది.

నిర్మాతలు మీ స్నేహితులే కాబట్టి ఏమైనా ప్రెజర్ గా ఫీల్ అయ్యారా..? 

శశి, విజయ్ నా కాలేజ్ ఫ్రెండ్స్, రూంమేట్స్. శశి అమెరికాలోనే ఉంటాడు. విజయ్ మాత్రం ఇక్కడ పనులు చూసుకున్నాడు. నన్ను హీరోగా బాగా ప్రమోట్ చేయడానికే వాళ్ళు ఈ సినిమా చేశారు. విజయ్ చదువుకున్న రోజుల నుండి కృష్ణ గారికి పెద్ద ఫ్యాన్. ఆయన చెప్పిన డైలాగ్స్ అన్ని చెప్పేసేవాడు. అప్పుడే తనతో నువ్వు సినిమాల్లోకి వెళ్ళాలి అని. ఈ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్స్ గా వాళ్ళు నా పక్కనే ఉంటారు. స్నేహితులు కాబట్టి సినిమాపై ఎక్స్ ట్రా కేర్, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వచ్చింది. సెట్స్ విషయంలో, రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టొద్దని చెప్పేవాడిని. కాని నా కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం గా రూపొందించారు.  

సినిమాలో హైలైట్స్ ఏంటి..?

రెగ్యులర్ సినిమాల ఫార్ములా బ్రేక్ చేశాం. ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్స్ , రోమాన్స్ లా కాకుండా మంచి ఫన్ ఫిలిం తీశాం. సినిమాలో తొంబై శాతం షూటింగ్ లైట్ లేకుండా చేశాం. సినిమాలో సస్పెన్స్ ఉంటూనే కామెడీ కూడా ఉంటుంది. కామెడీ ఉంటేనే కమర్షియల్ ఫిలిం అని భావిస్తాను. 

మీ బాలీవుడ్ సినిమా సంఘతేంటి..?

సబ్బిర్ ఖాన్ డైరెక్షన్ లో వస్తోన్న 'భాగి' సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాను. ఇప్పటికి మూడు షెడ్యూల్స్ పూర్తి చేశాం. ఇంకో షెడ్యూల్ బ్యాలన్స్ ఉంది. నేను హీరోగా కూడా ఇంత స్ట్రాంగ్ రోల్ చేయలేదు. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కు ప్రిపేర్ అయినట్లు 'భాగి' సినిమా కోసం నా ఫిజికల్ లుక్ ను సిద్ధం చేశాను. 'కలరి పట్టు' మీద ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. 

బాలీవుడ్ కు టాలీవుడ్ కు మధ్య చిత్రీకరణలో ఏమైనా మార్పులు ఉన్నాయా..?

బడ్జెట్ అనేది రెండిటికి ఉన్న తేడా. మనం రోజుకు 3 లక్షలు ఖర్చు పెడితే బాలీవుడ్ లో 15 లక్షల వరకు ఖర్చుపెడతారు. చాలా ఆర్గనైజ్డ్ గా ఉంటారు.ఆర్టిస్ట్ ను, టెక్నీషియన్స్ ను బాగా చూసుకుంటారు. 

ప్రభాస్, మహేష్ బాబు లు సినిమా చూశారా..?

మహేష్ ఇంకా చూడలేదు. కాని ప్రభాస్ ఆల్మోస్ట్ చూసినట్లే లెక్క. ఎందుకంటే మేము చేసే ప్రతిది ఆయన దగ్గరకు వెళ్లి చూపించాం. కొన్ని ఇన్ పుట్స్ కూడా ఇచ్చారు. హీరో కాకముందు యు.వి.క్రియేషన్స్ వంశీ, నేను, విజయ్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. వంశీ, ప్రబాస్ మంచి ఫ్రెండ్స్. తన ద్వారా ప్రభాస్ తో ఈ సినిమా గురించి డిస్కస్ చేసేవాళ్ళం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ఇప్పటివరకు ఏ సినిమాలు సైన్ చేయలేదు. ఇది బ్యానర్ లో వరుసగా సినిమాలు ఉండొచ్చు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ