Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-శ్రీరామ్ ఆదిత్య!

Sat 26th Dec 2015 07:07 PM
sriram adittya interview,bhale manchi roju movie,vijay,sudheer babu  సినీజోష్ ఇంటర్వ్యూ-శ్రీరామ్ ఆదిత్య!
సినీజోష్ ఇంటర్వ్యూ-శ్రీరామ్ ఆదిత్య!
Advertisement
Ads by CJ

'భలే మంచి రోజు' చిత్రం ద్వారా శ్రీరామ్ ఆదిత్య అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. చదువుకుంది మెకానికల్ ఇంజనీర్. గూగుల్, ఫేస్ బుక్ లాంటి గొప్ప గొప్ప కంపనీలలో పని చేశాడు. సినిమాల మీద ఉన్న మక్కువతో చేస్తున్న ఉద్యోగం వొదిలేసి 'భలే మంచి రోజు' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లో శ్రీరామ్ ఆదిత్య విలేకర్లతో ముచ్చటించారు.

స్క్రిప్ట్ రెడీ చేసుకొని జాబ్ మానేసా..

నేను పుట్టింది హైదరాబాద్ లోనే. ఎనిమిదవ తరగతి వరకు బెంగుళూరులో చదువుకున్నాను. తరువాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. చదువు పూర్తయ్యాక గూగుల్, ఫేస్ బుక్ లలో రెండున్నర సంవత్సరాల పాటు పని చేశాను. జాబ్ చేసే సమయంలోనే స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఉద్యోగం వొదిలేశాను.

షార్ట్ ఫిల్మ్స్ చేశాను..

ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడ్ని. నేను చేసిన ఎనిమిది లఘు చిత్రాల్లో ఆరు చిత్రాలకు అవార్డ్స్ వచ్చాయి. రెండు నేషనల్ అవార్డ్స్, ఒకదానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవంతోనే కథలు రెడీ చేసుకొని సినిమా చేయాలనుకున్నాను. ఇప్పటివరకు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయలేదు. స్క్రిప్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ సినిమా చేశాను.

విజయ్ గారికే మొదట చెప్పాను..

ఈ కథ రెడీ చేసుకున్న తరువాత నాకు తెలిసిన వాళ్ళ ద్వారా మొదట విజయ్ గారికే చెప్పను. చెప్పగానే ఓకే చేసి నాలుగైదు రోజుల్లోనే సినిమా కూడా మొదలు పెట్టేశారు. అప్పటికే విజయ్ గారు సుదీర్ బాబు తో సినిమా చేయాల్సివుంది. వాళ్ళు అనుకున్న కథను పక్కన పెట్టేసి నాతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సుదీర్ బాబుతో సినిమా అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' సినిమాలో ఆయన నటన చూసి థ్రిల్ అయ్యాను. 

ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగేదే సినిమా..

ఈ సినిమా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రయోగాత్మక చిత్రమయినా.. కమర్షియల్ యాస్పెక్ట్స్ ఉంటాయి. సినిమాలో ఉండే ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలిగేదే సినిమా. నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ మాత్రమే కాదు సస్పెన్స్, థ్రిల్లింగ్ ఇలా అంతా ఎంటర్టైన్మెంటే.. నేను స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే నవ్వుకునే సీన్స్ చాలా వచ్చాయి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతోనే తీశాను. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్స్.

మంచి టీం వలనే కుదిరింది..

10 నిమిషాల షార్ట్ ఫిలిం చేయడానికి, రెండు గంటల సినిమా చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. లఘు చిత్రాలు మనకు కావలసినట్లుగా తీసుకోవచ్చు. అదే సినిమాకు వచ్చేసరికి డైరెక్టర్ ఐడియాను నమ్మి మొత్తం టీం అంతా పని చేయాలి. నాకు మంచి టీం దొరకడం వలన సినిమా చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది. నేను కథ ఎలా అనుకున్నానో.. అలా తీయగలిగాను. 

సుదీర్ మాత్రం ఇరిటేట్ అవ్వలేదు..

సుదీర్ కెమెరా ముందుకు రాగానే డిఫరెంట్ పర్సన్ అయిపోతాడు. కొన్ని సార్లు ఒక సీన్ కోసం చాలా టేక్స్ తీసుకుంటాను. పెర్ఫార్మన్స్ బాగాలేక కాదు.. ఇంకా బెటర్ గా వస్తుందనే ఫీలింగ్ తో.. ఈ సినిమాలో ఒక సన్నివేశం కోసం సుమారు ఇరవై టేక్స్ తీసుకున్నాను. మరొక నటుడైతే ఖచ్చితంగా ఇరిటేట్ అవుతారు. కాని సుదీర్ మాత్రం ఇరవై ఒకటో టేక్ చేయడానికి కూడా రెడీ అయ్యాడు. నాకు బ్రదర్ లాంటివాడు. తనతో ఏదైనా మాట్లాడే ఫ్రీడమ్ ఉంది.

మొదట డౌట్ పడ్డారు..

కొత్త డైరెక్టర్ అంటే ఎవరికైనా కాస్త డౌట్ ఉంటుంది. అలానే సుధీర్ బాబు కూడా మొదట డౌట్ పడ్డాడు. కాని నేను చేసిన షార్ట్ ఫిలిం చూసి తనకొక నమ్మకం ఏర్పడింది. రెండు, మూడు రోజులు షూట్ చేసిన తరువాత నా మీద నమ్మకం పెరిగింది. 

లైట్స్ లేకుండానే చేశాం..

ఈ చిత్రం రియలిస్టిక్ గా ఉండాలని, రియల్ లోకేషన్స్ లో షూట్ చేశాం. న్యాచురల్ గా ఉండడానికి ఎక్కువగా లైట్స్ ఉపయోగించలేదు. యాభై శాతం లైట్స్ లేకుండానే వర్క్ చేశాం. శ్యాందత్ లాంటి సినిమాటోగ్రాఫర్ ఉన్నారు కాబట్టే అది సాధ్యమైంది. ఈ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది.

మహేష్ కు సినిమా చూపిస్తా..

మహేష్ బాబు గారు బిజీగా ఉన్నారు. ఆయనకు ఖాళీ దొరకగానే సినిమా చూపించాలనుకుంటున్నాం.

ప్రభాస్ మోరల్ సపోర్ట్ ఉంది..

ఈ సినిమా ప్రభాస్ ఇచ్చిన మోరల్ సపోర్ట్ మర్చిపోలేను. సీన్ ఆయనకు చెప్తే.. తన ఒపినియన్ మాత్రం చెప్పేవారు. మార్చమని ఒక్కసారి కూడా అనలేదు. 

శక్తి క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉండాలి..

ఈ సినిమాలో శక్తి క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉండాలని రాసుకున్నాను. హీరో ఎదుట నిలబడే పాత్ర కాబట్టి మంచి నటుడ్ని ఎన్నుకోవాలనుకున్నాను. సాయికుమార్ గారు వాయిస్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకోగలరు. శక్తి పాత్రలో సాయికుమార్ గారి పెర్ఫార్మన్స్ అమేజింగ్. డెడికేషన్ ఉన్న నటుడు. 

1000 థియేటర్లు వెతికాను..

సినిమాలో ఉండే థియేటర్ రియలిస్టిక్ గా ఉండాలని హైదరాబాద్ చుట్టుపక్కల సుమారుగా 1000 థియేటర్లకు పైగా వెతికాను. కాని ఏది కుదరలేదు. ఒక థియేటర్ అనుకున్నాం కాని పర్మిషన్ దొరకలేదు. ఇక ఫైనల్ గా హైదరాబాద్ లో 10 సంవత్సరాలుగా క్లోజ్ చేసి ఉంచిన మేనక థియేటర్ చూసి మాకు అనువుగా ఉందని కన్ఫర్మ్ చేశాం.

రీమేక్స్ చేయడం నచ్చదు..

నేను చేసే సినిమాలు ఏ భాషలోను రీమేక్ చేయను. ఒకే కథను అన్నిసార్లు డైరెక్ట్ చేయడం నచ్చదు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

నాలుగైదు కథలు సిద్ధంగా ఉన్నాయి కాని ఇంకా ఫైనల్ చేయలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ