Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-చాందిని

Sun 03rd Jan 2016 12:54 PM
chandini interview,chithram bhalare vichithram,ina ishtam nuvvu  సినీజోష్ ఇంటర్వ్యూ-చాందిని
సినీజోష్ ఇంటర్వ్యూ-చాందిని
Advertisement
Ads by CJ

'కాళీ చరణ్' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి చాందిని. 'లవర్స్' , 'కిరాక్' వంటి చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా 'చిత్రం భళారే విచిత్రం'లో దయ్యం పాత్రలో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంటోంది. ఈ సందర్భంగా హీరోయిన్ చాందినితో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాల్లోకి ఎలా వచ్చారు..?

సినిమాల్లో నటించాలనే ఆలోచన నాకు ఉండేది కాదు. నా ఎంట్రీ అనుకోకుండా జరిగింది. నేనేది ప్లాన్ చేసి చేయలేదు. నేను పుట్టింది, పెరిగింది చెన్నై లోనే. బి.ఎస్.సి విజువల్ కమ్యూనికేషన్ చేస్తున్నాను. 2007 లో 'మిస్ చెన్నై'గా సెలెక్ట్ అయ్యాను. మిస్ ఫొటోజెనిక్ అవార్డు గెలుచుకున్నాను. దాంతో తమిళ సినిమా ఆఫర్లు చాలా వచ్చాయి. తమిళ డైరెక్టర్ భాగ్యరాజ్ గారి సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను.

తెలుగులో ఎంట్రీ ఎలా జరిగింది..?

నాకు తమిళంలో నటించడం కంఫర్టబుల్ గా ఉంటుంది. నేను పుట్టింది చెన్నైలోనే కాబట్టి భాష సమస్య ఉండదు. అలా తమిళంలో కంటిన్యూ చేస్తున్న సమయంలో ఒక మ్యాగజిన్ లో నా ఫోటో చూసిన ప్రవీణ్ గారు 'కాళీ చరణ్' సినిమాలో నటించమని స్టొరీ చెప్పారు. కథ నచ్చడంతో నటించడానికి ఒప్పుకున్నాను.

'చిత్రం భళారే విచిత్రం' సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది..?

ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని విన్నాను. పర్టిక్యులర్ గా సినిమాలో హీరోయిన్ పెద్ద కళ్ళతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండాలని సినిమా యూనిట్ సెర్చ్ చేశారు. లవర్స్ సినిమాలో నన్ను చూసిన డైరెక్టర్ భాను ఫోన్ లోనే నాకు కథ మొత్తం నేరేట్ చేశారు. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో ఓకే చెప్పాను.

కెరీర్ స్టార్టింగ్ లోనే గోస్ట్ పాత్రలో నటించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..?

ఇది నా మొదటి హారర్ మూవీ. హీరోయిన్ గా ఇంత మంచి పాత్రలో నటించే అవకాశం రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను. నిజానికి నేను హారర్ సినిమాలు చూడను. ఈ సినిమాలో నా పాత్ర కోసం ప్రత్యేకంగా ఎలాంటి హోం వర్క్ చేయలేదు. డైరెక్టర్ చెప్పింది ఫాలో అవుతూ చేశాను.

షూటింగ్ టైంలో ఏమైనా భయపడ్డారా..?

సినిమా షూటింగ్ చేసేప్పుడు కంటే థియేటర్ లో చూసినప్పుడు ఎక్కువగా భయపడ్డాను. కాని థియేటర్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ మొత్తం నా పాత్ర మీదే సినిమా నడుస్తుంటుంది. హిలారియాస్ ఎంటర్టైన్మెంట్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మరోసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే ఆలోచన ఏమైనా ఉందా..? 

లేదండీ. హీరోయిన్ గా నేను చాలా బిజీగా ఉన్నాను. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. 2015లో ఎనిమిది తమిళ సినిమాల్లో, రెండు తెలుగు సినిమాల్లో నటించాను. ఈ సంవత్సరం కూడా నా చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. సో.. హీరోయిన్ గా నా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాను.

ఇష్టమైన హీరో, హీరోయిన్స్..?

నాకు అందరూ ఇష్టమే. పర్టిక్యులర్ గా ఒక పేరు చెప్పలేను. హీరోయిన్ అంటే మాత్రం రెజీనా బాగా నచ్చుతుంది.

నటి కాకపోయుంటే ఏం చేసేవారు..?

ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు ఉండే ఉద్యోగం చేసుకుంటూ ఒక సాధారణ జీవితాన్ని గడిపేదాన్ని. 

డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా..?

ఫుల్ లెంగ్థ్ రొమాంటిక్ ఫిలిం లో నటించాలనుంది. అలాంటి స్క్రిప్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

తమిళంలో 7 సినిమాలు కమిట్ అయ్యాను. తెలుగులో 'ఐనా ఇష్టం నువ్వు' చిత్రంలో నటిస్తున్నాను. షూటింగ్ కంప్లీట్ అయింది. సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ