Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-మేర్లపాక గాంధి

Sun 10th Jan 2016 11:17 PM
merlapaka gandhi interview,express raja,sharvanandh,surabhi,uv creation  సినీజోష్ ఇంటర్వ్యూ-మేర్లపాక గాంధి
సినీజోష్ ఇంటర్వ్యూ-మేర్లపాక గాంధి
Advertisement
Ads by CJ

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో దర్శకునిగా తెలుగు తెరకు పరిచయమయిన వ్యక్తి మేర్లపాక గాంధి. మొదటి సినిమాతోనే హిట్ ట్రాక్ ఎక్కిన ఈ దర్శకుడు 'ఎక్స్ ప్రెస్ రాజా' అనే మరో చిత్రంతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధితో సినీజోష్ ఇంటర్వ్యూ..

మీ రెండు చిత్రాల టైటిల్స్ లో ఎక్స్ ప్రెస్ అనే పదం ఉంది. అదేమైనా మీకు సెంటిమెంటా..?

హీరో క్యారెక్టరైజేషన్, సినిమా స్క్రీన్ ప్లే చాలా రైజింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్స్ ప్రెస్ రాజా అనే టైటిల్ పెట్టాను. టైటిల్ కూడా క్యాచీగా ఉండాలని ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నాను. నా తదుపరి చిత్రానికి ఎక్స్ ప్రెస్ అనే పదం వచ్చేలా టైటిల్ పెట్టను. 

సినిమా గురించి చెప్పండి..?

ఇదొక లవ్ స్టొరీ. సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. క్యారెక్టరైజేషన్స్ అన్ని కొత్తగా ఉంటాయి. సినిమాలో ప్రతి 15 నిమిషాలకు ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతూ ఉంటుంది. ఆ పాత్రలకు హీరో పాత్ర ఎలా ఇంటర్ లింక్ అవుతుందనేదే సినిమా. మొత్తం ఐదు స్టోరీలు ఉంటాయి. 

శర్వానంద్ పాత్ర ఎలా ఉండబోతోంది..?

ఇప్పటివరకు శర్వా నటించిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో తన లుక్, క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హీరో ఐడియాలు, ఆలోచనా విధానం ఫాస్ట్ గా ఉంటాయి. హీరోకు, హీరోయిన్ కు మధ్య విడిపోవడానికి ఒక కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. దానిని ఎదుర్కొని హీరో తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడనేదే ఈ కథ.

శర్వానంద్ ను దృష్టిలో పెట్టుకొనే కథ రాశారా..?

కథ రాసుకున్న తరువాతే హీరోగా ఎవరు సూట్ అవుతారో డిసైడ్ అవుతాను. 'రన్ రాజా రన్' సినిమాలో శర్వానంద్ చాలా బాగా నటించాడు. ఈ సినిమా కథ రాసుకున్న తరువాత శర్వా అయితే యాప్ట్ అవుతాడని తనని ఎప్రోచ్ అయ్యాను. తను మంచి నటుడు. శర్వానంద్ ను కొత్తగా కమర్షియల్ హీరోగా చూపించడానికి ప్రయత్నించాను. తనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది.

యు.వి.క్రియేషన్స్ లో అవకాశం ఎలా వచ్చింది..?

శర్వాకు కథ చెప్పిన తరువాత ఎవరి బ్యానర్ లో చేద్దామని అడిగారు. యు.వి అయితే బావుంటుందని చెప్పాను. ఇది నాకు హోం బ్యానర్ లాంటిది. చాలా బాగా ట్రీట్ చేస్తారు. నా నెక్స్ట్ సినిమా కూడా ఈ బ్యానర్ లోనే చేయాలని భావిస్తున్నాను.

మొదటి సినిమా తరువాత ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు..?

నా ఫస్ట్ సినిమా 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' తరువాత నాపై బాధ్యత మరింత పెరిగింది. తరువాత ఏ సినిమా చేసినా ఖచ్చితంగా హిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశా. ఒక సంవత్సరం పాటు స్క్రిప్ట్ మీదే వర్క్ చేశాను. 

హీరోయిన్ సురభిని ఎవరు సెలెక్ట్ చేశారు..?

నేనే సెలెక్ట్ చేశాను. ఈ సినిమాలో తన పాత్ర పేరు అమూల్య. మోసం అంటే భరించలేని అమ్మాయి. కాలేజ్ గోయింగ్ గర్ల్. సినిమాలో హీరోకు కూడా ఇంట్రడక్షన్ ఫైట్ లేదు కాని హీరోయిన్ కు మాత్రం ఉంటుంది. డేర్ డెవిల్ క్యారెక్టర్ తనది.

సంక్రాంతి కి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటి మధ్యలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి కారణం..?

నిర్మాతలు కథపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఫుల్ ఎంటర్టైనింగ్ మూవీ కాబట్టి సంక్రాంతికి రిలీజ్ చేస్తే బావుంటుందని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 

మీ నాన్నగారు మంచి రైటర్. ఆయన ఏమైనా సలహాలు ఇస్తూ ఉంటారా..?

నాన్న కథలన్నీ రొమాంటిక్ గా రాస్తాడు. నేను ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ లో రాస్తాను. ఆ విషయంలో ఇద్దరం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా చేసేప్పుడు నాన్న ఈ సినిమా హిట్ కాదురా.. అనవసరంగా ఇదంతా చేస్తున్నావని చెప్పారు. సినిమా చూసిన తరువాత డైరెక్టర్ గా సినిమా చాలా బాగా తీసావని చెప్పారు. ఇప్పుడిప్పుడే ఆయన నా ట్రాక్ లోకి వస్తున్నారు.

రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది..?

ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే డెఫినిట్ గా చెప్తాను.

పెర్సనల్ లైఫ్ ఎలా ఉంది..?

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' సినిమా తరువాత నా చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాను. పేరు సుష్మ. ఆగస్ట్ 15న కూతురు పుట్టింది. లిపి అనే పేరు పెట్టాం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ఇంకా ఏది కన్ఫర్మ్ కాలేదు. కాని ఖచ్చితంగా యు.వి బ్యానర్ లోనే చేస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ