Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-శ్రీవాస్(డిక్టేటర్)

Fri 22nd Jan 2016 11:54 AM
sriwass interview,balakrishna,eros international  సినీజోష్ ఇంటర్వ్యూ-శ్రీవాస్(డిక్టేటర్)
సినీజోష్ ఇంటర్వ్యూ-శ్రీవాస్(డిక్టేటర్)
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ హీరోగా, అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాస్వ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం 'డిక్టేటర్'. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీవాస్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..?

సినిమా చూసిన ప్రతి ఒక్కరు సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా వచ్చిందని చెబుతున్నారు. అన్ని చోట్ల నుండి ఊహించని స్పందన వస్తోంది. ఈ సినిమాతో బాలకృష్ణ గారికి స్పెషల్ ఇమేజ్ తీసుకురావలనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే ఆయనకు కొత్త ఇమేజ్ వచ్చింది.

కలెక్షన్స్ ఎలా ఉన్నాయి..?

సంక్రాంతికి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో.. కలెక్షన్స్ నాలుగు సినిమాలు ఖచ్చితంగా షేర్ చేసుకున్నట్లు ఉంటుంది. కాని సినిమా కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వలేదు. బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. మొదటినుండి నైజాంలో బాలయ్య గారి సినిమాలకు కలెక్షన్స్ తక్కువగానే ఉంటాయి. కాని ఈ సినిమా కలెక్షన్స్ మేము అనుకున్నట్లుగానే వచ్చాయి. ఈ వీకెండ్ నుండి ఓవర్ ఫ్లో మొదలవుతుంది.

బాలకృష్ణ గారి కోసమే కథ రాసుకున్నారా..?

నేను బాలయ్య బాబుని దృష్టిలో పెట్టుకునే కథ రాసుకున్నాను. లౌక్యం సినిమా తరువాత ఆయన నన్ను పిలిపించి నా 99 వ సినిమా మన కాంబినేషన్ లో చేద్దామని చెప్పారు. కేవలం నా మీద నమ్మకంతో ఆయన సినిమా చేయడానికి ఓకే చెప్పారు. కాబట్టి బాలయ్య ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ బాధ పడకుండా క్లాస్ టచ్ తో ఉండే సినిమా చేయాలనుకున్నాను. కథ రెడీ అవుతున్న సమయంలో టైటిల్ పవర్ ఫుల్ గా ఉండాలని క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలని 'డిక్టేటర్' అనే టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నాం. 

దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు చూసుకోవడంలో కష్టం అనిపించలేదా..?

మొదట ఈ సినిమాకు డైరెక్షన్ మాత్రమే చేయాలనుకున్నాం. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ వారు తెలుగులో సినిమాలను ప్రొడ్యూస్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుసుకొని కలిశాను. అయితే వారు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరోకరు ఉండాలని భావించారు. ఒక నెలపాటు వాళ్ళతో ట్రావెల్ చేసాక నన్నే ప్రొడక్షన్ చూసుకోమని చెప్పారు. దాంతో వేదాస్వ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించాను. భవిష్యత్తులో కూడా ఈరోస్ వాళ్ళతో కలిసి ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి.

బాలయ్యతో సినిమా అనగానే మొదట ఎలా ఫీల్ అయ్యారు..?

అందరూ బాలకృష్ణ గారితో సినిమా అనగానే ఆయన తిడతారేమో అని భయపడతారు. నేను ఆయనకు దగ్గరగా ట్రావెల్ చేశాను. ఆయన చుట్టూ ఉండేవాళ్ళు నీతిగా, నిజాయితీగా, సింగిల్ ఫేస్ తో ఉండాలని భావిస్తారు. నేను కూడా ఆయనలానే ఉంటాను కాబట్టి నాకు బాగా దగ్గరయ్యారు. ఒక కుటుంబ సభ్యుడిలాగా చూసుకున్నారు. 95 రోజుల షూటింగ్ సమయంలో ఆయన ఒక్కరోజు కూడా సీరియస్ అవ్వడం చూడలేదు. ఆయన చేయనివన్ని ఈ సినిమా కోసం చేశారు. టీం అందరికి సక్సెస్ పార్టీలు, అందరిని పిలిచి డబ్బులు ఇచ్చారు. నా పెర్సనల్ గా బాలకృష్ణ గారితో ఒక కొత్త పాయింట్ తీసుకొని సినిమా చేయడం కంటే అందరికి అర్ధమయ్య పాయింట్ ను తీసుకొని కొత్తగా చూపించాలనుకున్నాను. స్టార్ డం ఉన్న హీరోలతో ప్రయోగం చేయడం కష్టం. కొత్త వాళ్ళతో అయితే ప్రయత్నించొచ్చు.

మీకేమైనా గిఫ్ట్ ఇచ్చారా..?

బాలకృష్ణ గారు నాకిచ్చిన ఇంపార్టెన్స్ నాకు పెద్ద గిఫ్ట్. నారా చంద్రబాబునాయుడు గారు ఫోన్ చేసి సినిమా చాలా బాగా చేసావని, సంక్రాంతి రోజు మంచి గిఫ్ట్ ఇచ్చావని చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో సమానంగా నన్ను చూడడం చాలా సంతోషంగా అనిపించింది.

బాలకృష్ణ గారి లుక్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు..?

అందరూ సినిమా చేసేప్పుడు ఏం చేయాలి..? ఏం చేయకూడదని రాసుకుంటారు..?. నేను మొదట ఏం చేయకూడదో..? రాసుకున్నాను. లైట్ గా డీసెంట్ గా ఉండే కలర్స్ కాస్ట్యూమ్స్ గా ఉపయోగించాం. హెయిర్ స్టైల్ కొత్తగా ఉండాలని ట్రై చేశాం. బాలకృష్ణ గారు చెప్పే డైలాగ్స్ కూడా అరిచినట్లు కాకుండా స్మూత్ గా ఉంటాయి.

సినిమా బయ్యర్స్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు 15 %డిస్కౌంట్ ఇచ్చినట్లున్నారు..?

ఈ సినిమా బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు తెలిసినవాళ్ళే. మంచి ఫ్యాన్సీ రేట్లకు సినిమాను కొనుగోలు చేశారు. అడ్వాన్సులు కూడా ఇచ్చారు. కాని 4 సినిమాలు రిలీజ్ ఉండడం వలన థియేటర్ల సమస్య వచ్చింది. 30 థియేటర్లు అనుకుంటే 15 మాత్రమే దొరికేవి. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ కు డబ్బులు ఇవ్వడం కష్టం అయింది. ఆ విషయం సినిమా రిలీజ్ కు ముందు రోజు చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 15 రోజుల ముందుగానే చెప్పారు. నేను ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో మాట్లాడి బాలయ్య సమక్షంలో 15% డిస్కౌంట్ ఇప్పించాను. ఈరోజు బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు.

మీ బ్యానర్ లో బయట దర్శకులతో పని చేస్తారా..?

ఖచ్చితంగా చేస్తాను. మంచి కథలు ఉంటే బయట దర్శకులతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 

కోన వెంకట్ ను సైడ్ ట్రాక్ లో ఏమైనా పెట్టారా..?

అలా ఏం లేదు. సక్సెస్ పార్టీ రోజు కూడా అందరం కలిసి ఉండాలనుకున్నాం. కాని గోపీమోహన్ అమెరికాలో ఉండడం, కోన గారు బొంబాయిలో బిజీగా ఉండడం వలన కుదరలేదు.

హిందీలో రీమేక్ చేస్తున్నారా..?

అజయ్ దేవగన్ గారు ఈరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి సినిమా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చారు. సో.. ఆయనకు ఈ సినిమా చూపిస్తాను. నచ్చితే నేనే డైరెక్ట్ చేస్తాను.

సక్సెస్ టూర్స్ ఏమైనా నిర్వహిస్తున్నారా..?

రేపు ఉదయాన్నే నేను, బాలకృష్ణగారు మరికొంత మంది కలిసి వైజాగ్ జగదాంబ థియేటర్ కు వెళ్తున్నాం. అక్కడ నుండి రాజమండ్రీ వెళ్లి ఫ్యాన్స్ ను కలుస్తున్నాం. ఆ తరువాత తెలంగాణాలో థియేటర్లకు వెళ్తున్నాం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ఇంకా ఏది ఫైనల్ చేయలేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ