Advertisementt

రాజమౌళి ప్రభావం లేదు: జగదీశ్ తలశిల

Tue 26th Jan 2016 04:58 PM
jagadeesh thalasila interview,lacchimdeviki o lekkundi,lavanya tripathi  రాజమౌళి ప్రభావం లేదు: జగదీశ్ తలశిల
రాజమౌళి ప్రభావం లేదు: జగదీశ్ తలశిల
Advertisement
Ads by CJ

నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి29 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా.. దర్శకుడు జగదీశ్ తలశిలతో సినీజోష్ ఇంటర్వ్యూ..

అనాధ డబ్బు కథే ఇది..

జనాలు మర్చిపోయిన డబ్బులు అనాధగా పడి ఉన్నాయి. 1950వ సంవత్సరం నుండి బ్యాంకులలో కొన్ని కోట్ల డబ్బు అనాధగా పడి ఉంది. ఇండియన్ ఎకానమీలో కూడా ఈ ఇష్యూ ఉంది. అందరు క్లైమ్ చేయకుండా వదిలేసిన డబ్బుకు సంబంధించిన కథే ఇది. ఈ కథకు ఎంటర్టైన్మెంట్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి తీశాం. హారర్ కూడా ఎంటర్టైనింగ్ డ్రామాలా ఉంటుంది. నిజమైన హారర్ కాదు. సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు. 

అలా ఆలోచన వచ్చింది..

బ్యాంకులలో కొందరు వడ్డీ తీసుకోకుండా డబ్బును డిపాజిట్ చేసి వదిలేస్తుంటారు. ముస్లింల ఖురాన్ లో వడ్డీ తీసుకోవడం పాపమని రాసి ఉంటుంది. దాంతో వారంతా డిపాజిట్ చేసిన డబ్బుకు వడ్డీ తీసుకోరు. ఆ డబ్బు కొన్ని కోట్లలో ఉంది. దీనికి సంబంధించి పార్లమెంట్ లో ఓ బిల్ కూడా ఉంది. ఈ డబ్బంతా బయటకు రావాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించాను. ఎంటర్టైన్మెంట్ లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా సినిమా ఉంటుంది. 

ఆయన ప్రభావం ఉండదు..

మద్రాసు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాను. 2003లో 'అమృతం' సీరియల్ కోసం పని చేశాను. ఆ తరువాత రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ గా 'మగధీర' , 'మర్యాదరామన్న' , 'ఈగ' సినిమాలకు పని చేశాను. అందరు నా సినిమా మీద రాజమౌళి గారి ప్రభావం ఉంటుందనుకుంటారు. కాని ఆయన ప్రభావం లేకుండా సినిమా తీశాను. 

కథ నచ్చే మ్యూజిక్ చేశారు..

కీరవాణి గారిని మొదట మ్యూజిక్ చేయమని అడిగారు. ఆయన మొత్తం స్క్రిప్ట్ వినిపించమని అడిగారు. రెండు రోజుల తరువాత సినిమా చేయడానికి అంగీకరించారు. ఆయన ఓకే చేసిన వెంటనే నాకు టెన్షన్ మొదలయ్యింది. అప్పటివరకు కుటుంబంలో ఒకరిగా ఉండేవాడిని. ఆ తరువాత కీరవాణి గారే నేను కంఫర్ట్ గా ఫీల్ అయ్యేలా చేశారు. జె.పి గారితో ఒక పాట కూడా పాడించారు.

రెండు క్యారెక్టర్స్ చుట్టూ కథ తిరుగుతుంటుంది..

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తుంది. ఉమాదేవి, అంకాలమ్మ పాత్రలో బాగా నటించింది. ఆ రెండు పాత్రల చుట్టే కథ తిరుగుతుంటుంది. మొదట సినిమా టైటిల్ కూడా ఉమాదేవి, అంకాలమ్మ వచ్చేలా యు/ఏ అనుకున్నాం. కాని ప్రేక్షకులకు రీచ్ అవ్వదని 'లచ్చిందేవికి ఓ లెక్కుంది' కన్ఫర్మ్ చేశాం.

ఇరిటేషన్ సాంగ్ ఉంటుంది..

ఈ సినిమాలో లావణ్యను చూసి ఇలా కూడా తను నటించగలదా..? అని అనుకునేవిధంగా ఉండాలని తనను ఎంపిక చేసుకున్నాను. స్పెషల్ గా తన కోసం ఒక ఇరిటేషన్ సాంగ్ కూడా ఉంటుంది. లిరిక్స్ లేకుండా ఉండే పాట అది. కాని ఆ పాటలో లావణ్య చాలా క్యూట్ గా ఉంటుంది. తన మూవ్మెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

గ్రాఫిక్స్ వలన లేట్ అయింది.. 

అక్టోబర్ లో సినిమా ఆడియోను రిలీజ్ చేశాం. నవంబర్ లోనే సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవ్వడం వలన జనవరిలో చేయాలనుకున్నాం. కాని చాలా సినిమాలు రిలీజ్ ఉండడంతో జనవరి 29న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.

ప్రొడక్షన్ నేనే చూసుకున్నా..

ఈ సినిమా ప్రొడ్యూసర్ నా స్నేహితుడు. తనకు ప్రొడక్షన్ హౌస్ గురించి పెద్దగా అవగాహన లేదు. సో.. డైరెక్షన్, ప్రొడక్షన్ రెండు నేనే చూసుకున్నాను. ఈ బ్యానర్ లో ఉగాది రోజు రాజమౌళి గారి చేతుల మీదుగా సినిమా ఓపెనింగ్ ఉంటుంది. కొత్త దర్శకులతో 3 నుండి 4 కోట్ల బడ్జెట్ లో సినిమాలు చేయాలనుకుంటున్నాం. 

రాజమౌళి గారు ఇంకా సినిమా చూడలేదు..

రాజమౌళి గారు నా సినిమా అనే కాదు. ఏ సినిమా ప్రీమియర్ షో చూడరు. రిలీజ్ అయిన మొదటిరోజే సినిమా చూస్తారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతానికి ఇంకా ఏది కన్ఫర్మ్ చేయలేదు. బిగ్ స్టాండర్డ్స్ లో ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమా చేయాలనుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ