Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-రాజ్ తరుణ్

Thu 28th Jan 2016 05:05 PM
raj tarun interview,srinivas gavireddy,sethamma andalu ramayya sithralu  సినీజోష్ ఇంటర్వ్యూ-రాజ్ తరుణ్
సినీజోష్ ఇంటర్వ్యూ-రాజ్ తరుణ్
Advertisement
Ads by CJ

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను పూర్తిచేసి క్రేజీస్టార్ గా మారిన యువ కథానాయకుడు రాజ్ తరుణ్ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'.ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్ బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జనవరి 29 న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

కథ బాగా కనెక్ట్ అయింది..

ఈ సినిమా ఐడియా చెప్పగానే బాగా నచ్చింది. నా బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా డెవలప్ చేశారు. ఇప్పటివరకు నేను నటించిన మూడు చిత్రాలకు ఈ సినిమాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇదొక చిన్నప్పటి ప్రేమ కథ. ప్రతి సిట్యువేషన్ ఫ్రెష్ గా ఉంటుంది. ఆడియన్స్ నుండి వచ్చే రియాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. 

ఆ ఏడుగురిలో నేనొకడిని..

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఊర్లో ఖాళీగా తిరిగే ఏడెనిమిది మంది బ్యాచ్ లో నేనొకడిని. సీతమ్మ కోసం ఈ రాముడు ఏం చేసాడనేడే కథ. అదే టైటిల్ గా పెట్టారు. సీతమ్మ అందాల కోసం రాముడు చేసిన సిత్రాల గురించి చెప్పే స్టొరీ. కథ రాసుకున్న తరువాతే డైరెక్టర్ కి ఈ టైటిల్ పెట్టే ఆలోచన వచ్చింది.

చేసేంత సేపు ఎంజాయ్ చేస్తా..

ఇప్పటివరకు నేను నటించిన మూడు చిత్రాల కోసం నేను కష్టపడి నటించలేదు. కథ నాకు కనెక్ట్ అయితే చాలు పాత్రలో ఎంజాయ్ చేస్తూ నటిస్తాను. సక్సెస్ వచ్చిందని హ్యాపీ అవ్వను.. ఫెయిల్యూర్ వచ్చిందని బాధ పడను. నా తప్పొప్పులు తెలుసుకొని మరొక సినిమా కోసం ప్రిపేర్ అవుతాను.

సోలో రిలీజ్ అంటే కష్టం..

జనవరి 29న మా సినిమాతో పాటు మరో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సోలో రిలీజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా పోటీకి చిత్రాలు ఉంటాయి. సినిమాలో కంటెంట్ ఉంటే అన్ని సినిమాలు హిట్ అవుతాయి. దానికి ఉదాహరణ సంక్రాంతికి రిలీజ్ అయిన నాలుగు సినిమాలే. 'సోగ్గాడే చిన్ని నాయన' , 'నాన్నకు ప్రేమతో' , 'డిక్టేటర్' , 'ఎక్స్  ప్రెస్ రాజా' ఇలా రిలీజ్ అయిన నాలుగు సినిమాలు విజయాన్ని అందించాయి. అలానే రేపు రిలీజ్ అవ్వబోయే మా సినిమాతో పాటు అన్ని సినిమాలు హిట్ అవుతాయని ఆశిస్తున్నాను.

కొత్త దర్శకుల్లో ఫైర్ ఉంటుంది..

మంచి సినిమా తీయాలని, తీసే సినిమా హిట్ అవ్వాలనే సినిమాలు చేస్తాం. యంగ్ డైరెక్టర్స్, కొత్త దర్శకుల్లో ఫైర్ ఉంటుంది. వాళ్లకి మొదటి సినిమా అనేది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. మంచి సినిమా చేయాలనే కంపల్షన్ ఉంటుంది. 

ప్రేక్షకులకు నచ్చితే అదే కమర్షియల్ సినిమా..

యాక్షన్ హీరోగానో, మాస్ హీరోగానో పేరు తెచ్చుకోవాలనే ప్యాషన్ లేదు. నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలి. 'ఉయ్యాలా జంపాలా' , 'సినిమా చూపిస్తా మావ' , 'కుమారి 21 ఎఫ్' ఇలాంటి సినిమాలు తీయడానికి రాజ్ తరుణ్ లాంటి హీరో ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం చిత్రాల్లో పెద్ద పెద్ద ఫైట్స్ ఐటెం సాంగ్స్ లేవు. కాని ఆ సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. నా దృష్టిలో ప్రేక్షకులకు రీచ్ అయ్యే సినిమానే కమర్షియల్ సినిమా. 

ప్రపంచాన్ని మరచిపోతా..

ఒకసారి సినిమా సెట్స్ మీదకి వెళితే ప్రపంచాన్ని మరచిపోతా. నా ఫోన్ నా దగ్గర ఉండదు. ఫ్రెండ్స్ తో మాట్లాడను. మొదట కథ మీద క్లారిటీ తెచ్చుకుంటాను. డైరెక్టర్ ఇమాజినేషన్ కు తగ్గట్లుగా అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

ఎమోషన్స్ మీద మంచి పట్టు ఉంది..

ఈ సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ నాకు ఎప్పటినుండో మంచి ఫ్రెండ్. 'కుమారి 21 ఎఫ్' లాంటి అన్ కన్వెన్శనల్ సినిమా తరువాత నేను ఎలాంటి సినిమాలో నటిస్తే బావుంటుందో.. ఆలోచించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీనివాస్ కు ఎమోషన్స్ మీద మంచి పట్టు ఉంది. డైలాగ్స్ చాలా బాగా రాసుకుంటాడు. ఈ సినిమాకు కూడా డైలాగ్స్ తో పాటు కథకు తగ్గ ఎమోషన్స్ రాసుకున్నాడు. ప్రపంచం ఏం అయిపోయినా.. సరే శ్రీనివాస్ అనుకున్నది మాత్రం సాధిస్తాడు.

ఖాళీగా ఉండడం నచ్చదు..

'ఉయ్యాలా జంపాలా' తరువాత లాంగ్ గ్యాప్ తీసుకొని 'సినిమా చూపిస్తా మావ'లో నటించాను. ఆ తరువాత కుమారి 21 ఎఫ్, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు అవకాశాలు వచ్చాయి. ఇప్పుడిప్పుడే మంచి స్క్రిప్ట్స్ ఆఫర్స్ వస్తున్నాయి. నాకు ఖాళీగా ఉండడం అసలు నచ్చదు. సంవత్సరంలో 365 రోజులు నటిస్తూ ఉండడానికే ఇష్టపడతాను.

కథ నచ్చితేనే నటిస్తాను..

మంచు విష్ణు, నేను హీరోలుగా ఓ పంజాబీ సినిమా రీమేక్ లో నటిస్తున్నాం. దానికి నాగేశ్వరెడ్డి గారు డైరెక్టర్. మంచు కాంపౌండ్ నుండి సినిమా అన్నారని నేను నటించడానికి ఒప్పుకోలేదు. నాకు కథ నచ్చిందని ఒప్పుకున్నాను. కాని నేను చూసిన డీసెంట్ ఫ్యామిలీస్ లో వాల్లోకరు. విష్ణు నాకు బ్రదర్ లాగా అయిపోయాడు. సినిమా టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో, దిల్ రాజు గారి బ్యానర్ లో సినిమాలు నటించడానికి ఒప్పుకున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ