Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-అదా శర్మ

Mon 08th Feb 2016 04:42 PM
adah sharma interview,garam movie,aadi,madan,saikumar  సినీజోష్ ఇంటర్వ్యూ-అదా శర్మ
సినీజోష్ ఇంటర్వ్యూ-అదా శర్మ
Advertisement
Ads by CJ

'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటి అదా శర్మ. ఆ తరువాత 'సన్నాఫ్ సత్యమూర్తి','సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రాల్లో నటించిన ఈ భామా తాజాగా 'గరం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరోయిన్ అదా శర్మ విలేకర్లతో ముచ్చటించారు.

ముస్లిం యువతిగా..

ఈ సినిమాలో ముస్లిం యువతి పాత్రలో కనిపిస్తాను. మొదటిసారిగా ఇలాంటి పాత్రలో నటించాను. ఈ సినిమాలో నాకు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. ఎక్కువగా కళ్ళతోనే నటించాను. ఎన్నో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి.

సెటిల్డ్ యాక్టర్ అనిపించుకోవాలి..

నేను నటించిన హార్ట్ ఎటాక్ సినిమా చూసి మదన్ గారు ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. హార్ట్ ఎటాక్ లో కూడా ఎమోషనల్ సీన్స్ చాలా ఉంటాయి. కళ్ళతోనే ఎక్కువగా నటించాను. ఆ రోల్ మదన్ గారికి బాగా నచ్చింది. బాబ్లీ హీరోయిన్ గా ఒక ముద్ర వేయించుకోవాలని లేదు. సెటిల్డ్ గా, సహజంగా నటించే నటిగా పేరు తెచ్చుకోవాలనుంది.

మణిరత్నం గారి సినిమా నాకు రిఫరెన్స్..

ముస్లిం యువతి పాత్రలో నటించడానికి రిఫరెన్స్ గా మణిరత్నం గారి సినిమాను తీసుకున్నాను. ఆయన  సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైరెక్ట్ చేసిన 'బొంబాయి' సినిమాలో మనీషాలాగా నటించడానికి ప్రయత్నించాను. సినిమాటోగ్రాఫర్ కూడా నన్ను చాలా బాగా చూపించారు.  

4 పాటలకు డాన్స్ చేశాను..

ఇప్పటివరకు నేను నటించిన సినిమాల్లో పెద్దగా డాన్స్ చేయడానికి స్కోప్ దొరకలేదు. కాని ఈ సినిమాలో మొత్తం ఐదు పాటల్లో నాలుగు పాటలకు డాన్స్ చేశాను. 'చిలక పాప' అనే మసాలా సాంగ్ కి డాన్స్ చేయడం చాలా బాగా అనిపించింది.

అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి..

'గరం' అనే కోపం, హాట్ ఇలా చాలా అర్ధాలు వస్తాయి. ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కో అర్ధం. ఈ సినిమా ఒక లవ్ స్టొరీ అని చెప్పలేం. ప్రేమ, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండే యూత్ ఫుల్ ఎంటర్టైనర్.

ఒక పాత్రకు స్టిక్ అవ్వాలని లేదు..

నా మొదటి సినిమా 1920 లో హారర్ పాత్రలో నటించాను. ఆ సినిమాలో లో గ్లామర్ రోల్ లో నటించాను. ఇప్పటివరకు పలానా పాత్రలో అదా బాగా నటిస్తుందనే ముద్రపడలేదు. నాకు కూడా ఒక పర్టిక్యులర్ పాత్రకు మాత్రమే స్టిక్ అవ్వాలని లేదు. నటిగా అన్ని పాత్రల్లో నటించగలగాలి.

చిన్న రోల్ అని ఆలోచించలేదు..

సన్నాఫ్ సత్యమూర్తిలో చిన్న పాత్ర అని చూడలేదు. నాకు త్రివిక్రమ్, బన్నీలతో కలిసి నటించాలనిపించింది. ఆఫర్ రాగానే చిన్న పాత్ర.. పెద్ద పాత్ర అను చూడలేదు. వెంటనే ఒప్పేసుకున్నాను. నామీద నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు. నా సంతోషమే నాకు ముఖ్యం. నన్ను సంతోష పరిచే ఏ పాత్రలో అయినా నటిస్తాను.

ఆది మంచి ఫాథర్..

ఆదితో ఇది నా మొదటి సినిమా. సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. సినిమా కోసం నేనే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తా.. అనుకుంటే ఆది నాకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసేవాడు. సుప్రీమ్లీ టాలెంటెడ్ పెర్సన్. తను మంచి ఫాథర్ కూడా. 

ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండియర్ గా ఉంటాయి..

ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్ గా ఉంటాయి. విజువల్ గా సినిమా బాగా రావడానికి ఎంతో హార్డ్ వర్క్ చేశారు. ఎక్కువగా షూటింగ్ హైదరాబాద్ లోనే చేశాం. సినిమాలో లోకల్ ఫ్లేవర్ కనిపిస్తుంది. సాయికుమార్ గారు నన్ను చాలా బాగా చూసుకున్నారు.

ప్రేమికులరోజుకి ప్లాన్ ఏం లేదు..

ఈసారి ప్రేమికుల రోజుకి ప్రత్యేకమైన ప్లానింగ్ ఏం లేదు. 10వ తారీఖున మా అమ్మ వస్తోంది. తనతో కల్సి 'గరం' సినిమా చూడాలి. 

ఖాళీగా ఉండే పెయింటింగ్ వేస్తా..

నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. రైట్ టైంలో మంచి చాన్స్ వస్తే ఖచ్చితంగా పాడతాను. అలానే మిమిక్రీ కూడా చేస్తాను. ఖాళీగా ఉంటే పెయింటింగ్ వేస్తాను.. మూవీస్ చూస్తాను.. బుక్స్ చదువుతాను.

పీరియాడిక్ సినిమాలో నటించాలనుంది..

బేసికల్ గా నేనొక కథక్ డాన్సర్ ని. కథక్ డాన్స్ ఉన్న ఒక పీరియాడిక్ ఫిలింలో నటించాలనుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

ప్రస్తుతం తెలుగులో 'క్షణం' సినిమాలో నటిస్తున్నాను. హిందీలో కొన్ని టాక్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.  

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ