Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-జయం రవి

Sun 14th Feb 2016 03:02 PM
jayam ravi interview,yamapaasham movie,shakthi soundar rajan  సినీజోష్ ఇంటర్వ్యూ-జయం రవి
సినీజోష్ ఇంటర్వ్యూ-జయం రవి
Advertisement
Ads by CJ

'బావ బావమరిది','పల్నాటి పౌరుషం' చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు జయం రవి. ఆ తరువాత చెన్నైకి వెళ్లి తమిళంలో ఘన విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం జయం రవి, లక్ష్మీ మీనన్ జంటగా శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వంలో సినీకార్న్ బ్యానర్ పై ముకేష్ ఆర్ మెహతా నిర్మించిన తమిళ చిత్రం 'మిరుథన్' ను 'యమపాశం' అనే పేరుతో నిర్మాత బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో జయం రవితో సినీజోష్ ఇంటర్వ్యూ..

సైన్స్ ఫిక్షన్ గా 'యమపాశం'..

యమపాశం సౌత్ సినిమాలో కొత్త జోనర్ అవుతుంది. జాంబీ అనే వెస్ట్రన్ కాన్సెప్ట్ తీసుకొని సినిమా చేశాం. ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్ మీద హాలీవుడ్ లో నాలుగు వందల నుండి ఐదు వందల వరకు సినిమాలొచ్చాయి. దర్శకుడు శక్తి నన్ను కలిసి సినిమా చేద్దామని కాన్సెప్ట్ చెప్పగానే పాజిటివ్ గా తీసుకున్నాను. ఇలాంటి సినిమాలు చేయాలంటే గట్స్ ఉండాలి. జాంబీ అంటే 'వాకింగ్ డెడ్'. కాని ఒక సైన్స్ ఫిక్షన్ గా ఈ సినిమాను రూపొందించాం.

అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి..

ఆడియన్స్ యాక్సెప్ట్ చేయగలిగే జోనర్ లోనే సినిమా చేశాం. ఎమోషన్స్, లవ్, సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ అన్ని అంశాలు ఉంటాయి. సెపరేట్ జోనర్ అని తెలియదు.

ట్రాఫిక్ పోలీస్ గా కనిపిస్తా..

ఈ సినిమాలో ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపిస్తాను. ఇప్పటివరకు లీడ్ క్యారెక్టర్స్ చేసిన ఏ హీరో ట్రాఫిక్ పోలీస్ పాత్రలో నటించలేదు. ఎవరు చేయని క్యారెక్టర్ నేను చేస్తే బావుంటుందని చేశాను. లైఫ్ లో ఎక్కువ రిస్క్ తీసుకోకూడదని అనుకునే వాడికే అన్ని రిస్క్ లు వస్తాయి. వాటన్నింటిని తనెలా ఎదుర్కొన్నాడనేదే సినిమా.

తెలుగులో కాస్త లేట్ అయింది..

చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను కెరీర్ స్టార్ట్ చేసింది తెలుగులోనే. నాన్నగారు తెలుగులో ఎన్నో చిత్రాలను సమర్పించారు. నేను ఇక్కడ నుండి బయటకు వెళ్ళినవాడినే. నేను నేర్చుకుంది అంతా ఇక్కడే. నిజానికి తెలుగులో ఎం.ఎస్ రాజు గారితో సినిమా చేయాల్సింది కాని కుదరలేదు. అప్పుడే తెలుగులో 'జయం' సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది.ఆ సినిమా అయితే నా డెబ్యూ సినిమాగా బావుంటుందని ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేశాం. ఆ తరువాత 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి','వర్షం' ఇలా చాలా సినిమాలను రీమేక్ చేశాను. అన్ని సినిమాలు పెద్ద విజయాన్ని సాధించాయి. దాంతో అక్కడే సెటిల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. తెలుగులో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకున్నాను. ఈ సినిమాను తెలుగులో, తమిళంలో ఫిబ్రవరి 19న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇక నుండి తెలుగులో సినిమాలు చేయాలనుకుంటున్నాను.

నేచర్ వర్సెస్ హ్యూమన్ కాన్సెప్ట్..

ప్పటివరకు హ్యూమన్ వర్సెస్ హ్యూమన్ సినిమాలు వచ్చాయి. అలా కాకుండా ఓ గ్లోబల్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలనుకున్నాం. నేచర్ వర్సెస్ హ్యూమన్ కాన్సెప్ట్ తీసుకొని సినిమా చేశాం. మనం ఎన్నో రకాలుగా నేచర్ ను ఇబ్బంది పెడుతున్నాం. ఆ నేచర్ మనమీదకు తిరగబడితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించాం. 55 రోజులు సినిమా షూట్ చేశాం. మేము పెట్టిన ఎఫర్ట్స్ కు తగ్గ రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాను. 

గ్రాఫిక్స్ అని కనిపెట్టలేరు..

ఈ సినిమాలో మొత్తం 1500 గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయి. అవే సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ఒక చోట కూడా గ్రాఫిక్స్ అని అనిపించదు. నేను జెనరల్ గా ఏ సినిమాకైనా 10 రోజులు డబ్బింగ్ చెప్తాను. కాని ఈ సినిమాకు ఒకరోజే చెప్పాను. నా డైలాగ్స్ అంత తక్కువ ఉంటాయి. 

రిఫరెన్స్ కోసం ఏం చూడలేదు..

నేను సుమారుగా అన్ని సినిమాలు చూస్తాను. అలానే హాలీవుడ్ లో కూడా జాంబీ సినిమాలు చాలా చూశాను. కాని ఈ సినిమా కోసమని ప్రత్యేకంగా ఏది చూడలేదు. 

లక్ష్మీ మీనన్ చక్కగా నటించింది..

ఈ సినిమాలో లక్ష్మీమీనన్ బాధ్యత గల డాక్టర్ పాత్రలో నటించింది. గ్లామర్ రోల్ అని కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటుంది. ఈ సినిమాలో పాత్రను నమ్మి వర్క్ చేసింది.

రెస్పాన్సిబిలిటీ పెరిగింది..

'తని ఒరువన్' సినిమాతో నాపై బాధ్యత మరింత పెరిగింది. తెలుగులో కూడా ఆ సినిమాను రామ్ చరణ్ రీమేక్ చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది.

అరవింద్ తో మరో సినిమా..

అరవింద్ స్వామీ, నేను కలిసి మరో సినిమాలో నటిస్తున్నాం. త్వరలోనే ఆ సినిమా వివరాలను వెళ్ళడిస్తాను.

అన్నయ్యతో సినిమా ఉంటుంది..

నా ప్రతి సినిమా గురించి ఇంట్లో డిస్కస్ చేసుకుంటాం. రీసెంట్ గా అన్నయ్య(మోహన్ రాజా) ఒక లైన్ చెప్పాడు. బాగా నచ్చింది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ