Advertisementt

బర్త్ డే స్పెషల్: శర్వానంద్

Sun 06th Mar 2016 01:26 PM
sharwanand,birthday interview,express raja,rajadhiraja  బర్త్ డే స్పెషల్: శర్వానంద్
బర్త్ డే స్పెషల్: శర్వానంద్
Advertisement
Ads by CJ

'గమ్యం','ప్రస్థానం','అందరి బంధువయ' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో శర్వానంద్. 'ఎక్స్ ప్రెస్ రాజా'తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ నటుడు మార్చి 6న పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సంతోషంగా ఉన్నా..

చాలా హ్యాపీ గా ఉంది. 'ఎక్స్ ప్రెస్ రాజా' ఇంత పెద్ద హిట్ చేసినందుకు కాస్త ఊపిరి పీల్చుకున్నా.. ఈ సినిమాతో సంక్రాంతికి హిట్ కొట్టాను. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ చాలా సంతోషంగా ఉన్నారు.

బర్త్ డే ప్లాన్స్..

సినిమాలు ఎక్కువగా చేయాలనుకుంటున్నాను. కథలు మీద ఎక్కువగా కూర్చొని కొంచెం కొంచెం గ్యాప్ లో సినిమాలు చేయాలనుకుంటున్నాను. స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి.  

ఈ సంవత్సరంలో మూడు సినిమాలు చేస్తా..

ఈ సంవత్సరంలో మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. కేసినేని నాని గారి తమ్ముడు చిన్ని నాకోసం కథ రాసుకుంటున్నారు. అలానే మరో ముగ్గురు డైరెక్టర్స్ కథలు రాస్తున్నారు. ఎవరి సినిమా ముందుగా మొదలుపెడతానో.. చెప్పలేను. బౌండెడ్ స్క్రిప్ట్ వచ్చే వరకు ఏ సినిమా కూడా మొదలుపెట్టను.

గ్యాప్ కావాలని తీసుకోలేదు.. 

ఇదివరకు కంటే ఇప్పుడు సినిమాలు తొందరగా చేస్తున్నాను అంటున్నారు. గతంలో కూడా గ్యాప్ కావాలని తీసుకోలేదు. మంచి స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేశాను. 

రాజాధిరాజా సినిమా గురించి..

ఐదేళ్ళ క్రిందట చేసిన సినిమా అది. మొదట 'ఏమిటో ఈ మాయ' అనే టైటిల్ అనుకున్నాం. ఇప్పుడు 'రాజాధిరాజా' అనే టైటిల్ పెట్టినట్లున్నారు. ఆ సినిమాలో నా క్యారెక్టర్ పేరు జెకె. ఇప్పుడు రాజా అని మార్చారనుకుంటాను. నాకు పెద్దగా తెలియదు. ఇప్పుడు ఎవరు రిలీజ్ చేస్తున్నారో.. కూడా ఐడియా లేదు.

థ్రిల్లర్ కూడా చేయొచ్చు..

థ్రిల్లర్ సినిమాల్లో నేను చేయొచ్చు. కథ నచ్చితే ఖచ్చితంగా చేస్తాను. కాని అలాంటి సినిమాలకు రిపీటేడ్ ఆడియన్స్ ఉండరు. తక్కువ బడ్జెట్ లో జాగ్రత్తగా సినిమా చేసుకోవాలి. కాని నాకు ఎక్కువగా లవ్ స్టోరీస్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. 

తెలుగుకే ప్రాధాన్యం.. 

తమిళం నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కాని అప్పుడే అక్కడ చేయాలనుకోవట్లేదు. మొదట తెలుగులో అయిన తరువాతే తమిళంలో చేస్తాను. 

దేవుడికి థాంక్స్ చెప్పాలి..

శర్వా ఇది కూడా చేయగలడని దర్శకులు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రొడ్యూసర్స్ కూడా నాతో సినిమా చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ విషయంలో దేవుడికే థాంక్స్ చెప్పాలి.

ప్రొడ్యూసర్స్ ను రిస్క్ లో పెట్టలేను..

లిమిటెడ్ బడ్జెట్ లోనే సినిమా చేయాలి. ఒక సినిమా హిట్ అయింది కదా.. అని ఎక్కువగా ఖర్చుపెట్టలేము. డిస్ట్రిబ్యూటర్స్ ను ప్రొడ్యూసర్స్ ను రిస్క్ లో పెట్టలేను. ప్రతి సినిమాకు ప్రొడ్యూసర్స్ నా రెమ్యునరేషన్ పెంచే ఇస్తున్నారు. ఊరికే ఎవరు డబ్బులు ఇవ్వరు కదా..!

ఆ దర్శకులతో పని చేయాలనుంది..

రాజమౌళి, మణిరత్నం, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులతో పని చేయాలనుంది. జగన్ గారి సినిమాలో మొదట నటించాలనుంది. ఆయన సినిమాల్లో హీరోలకు స్పెషల్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి.

నిత్య మంచి నటి..

నేను ఇప్పటివరకు నటించిన హీరోయిన్లందరిలో నిత్యమీనన్ అంటే నాకు ఇష్టం. చాలా బాగా నటిస్తారు. తన డైలాగ్ డెలివరీ కూడా బావుటుంది.

ఇంకా ఆ రేంజ్ హిట్ రాలేదు..

మూడు సంవత్సరాలుగా నా కెరీర్ చాలా బావుంది. వరుసగా హిట్స్ వస్తున్నాయి. కాని గమ్యం, ప్రస్థానం రేంజ్ లో ఇంకా హిట్ రాలేదనే అనుకుంటున్నాను.

సినిమాతో ప్రేమలో ఉన్నాను..

నేను ఎవరితో అయినా ప్రేమలో ఉన్నాను అంటే అది సినిమానే. ప్రస్తుతం సినిమాల్లో నటించడం, తినడం, పడుకోవడం, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం ఇవే నా పనులు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ