Advertisementt

విలన్ రోల్స్ చేయడానికి రెడీ: సుధీర్ బాబు

Tue 03rd May 2016 10:38 PM
sudheer babu,bhagi movie,pullela gopichand  విలన్ రోల్స్ చేయడానికి రెడీ: సుధీర్ బాబు
విలన్ రోల్స్ చేయడానికి రెడీ: సుధీర్ బాబు
Advertisement
Ads by CJ

తెలుగులో 'ఏమాయ చేసావే' చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు సుధీర్ బాబు. అలానే హిందీలో కూడా 'బాఘీ' అనే చిత్రం ద్వారా విలన్ గా పరిచయమయ్యాడు. ఈ సినిమాకు నేషనల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా సుధీర్ బాబు పాత్రకు విమర్శకుల ప్రసంశలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా సుధీర్ బాబు విలేకర్లతో ముచ్చటించారు. 

''మొదటిసారిగా బాలీవుడ్ సినిమాలో నటించాను. తెలుగులో నేను ఎంట్రీ ఇచ్చింది విలన్ గానే.. హిందీలో కూడా అలానే ఎంట్రీ ఇచ్చాను. సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. నేను నటించిన 'ఎస్ఎంఎస్' సినిమాలో చేసిన కొన్ని స్టంట్స్ యుట్యూబ్ లో పోస్ట్ చేశాను. అవి చూసి 'బాఘి' సినిమా ఆడిషన్స్ కు రమ్మని పిలిచారు. ఏదో చిన్న పాత్ర కోసం పిలిచారనుకొని.. నో చెప్పాలనుకున్నాను. కాని కథ వినగానే బాగా నచ్చింది. మన 'వర్షం' సినిమాకు సిమిలారిటీస్ ఉంటాయి. నేను బాలీవుడ్ లో నటించడంపై నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. కాని సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత అందరికీ బాగా నచ్చింది. యుట్యూబ్ లో 12 వేల వ్యూస్ వచ్చాయి. అలానే సినిమా ప్రివ్యూ చూసి బాలీవుడ్ క్రిటిక్ తరన్ ఆదర్శ్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. డైలాగ్స్ లేని చోట కూడా కళ్ళతో మంచి అభినయాన్ని కనబరిచావని చెప్పారు. హీరోయిన్ శ్రద్ధా కపూర్ వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ చేసి బాగా నటించానని, బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే హిందీలో చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కాని మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకొని నటించాలనుకుంటున్నాను. హీరోగానే నటించాలని డిమాండ్ పెట్టుకోకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న ఏ పాత్రలో అయినా నటించాలని భావిస్తున్నాను. తెలుగులో కూడా విలన్ పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను. విలన్ రోల్స్ లో నటిస్తే లేడీ ఫ్యాన్స్ తగ్గిపోతారనుకున్నాను కానీ 'బాఘీ' సినిమా చూసి ట్విట్టర్ లో, ఫేస్ బుక్ లో ఎక్కువ మంది అమ్మాయిలే మెసేజ్ లు చేస్తున్నారు. నేను సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను. చుట్టూ ఉండే వారి సలహాలు తీసుకున్నా.. ఫైనల్ డెసిషన్ మాత్రం నాదే. ప్రస్తుతం పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించడానికి ప్లాన్ చేస్తున్నాను. పెద్ద పెద్ద బ్యానర్స్ ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొస్తున్నారు. బేసిక్ గా నేను బ్యాట్మింటన్ ప్లేయర్ ను కాబట్టి ఆ పాత్ర కోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. పుల్లెల గోపీచంద్ ను నేను దగ్గర నుండి చూశాను. తను ఫేస్ చేసిన స్త్రగుల్స్ నాకు తెలుసు. ఆ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రూపొందించాలనుకుంటున్నాం. అయితే ఈ సినిమాకు ముందు ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నాను. 'భలే మంచి రోజు' సినిమాకు కో డైరెక్టర్ గా పని చేసిన శ్రీరాం రెడ్డి కథ చెప్పారు. బాగా నచ్చింది. ఈ నెలాఖరున సినిమా షూటింగ్ ఉంటుంది'' అని చెప్పారు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ