Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: శ్రీదివ్య

Fri 27th May 2016 11:47 AM
sri divya interview,rayudu movie,vishal,mutthayya  సినీజోష్ ఇంటర్వ్యూ: శ్రీదివ్య
సినీజోష్ ఇంటర్వ్యూ: శ్రీదివ్య
Advertisement
Ads by CJ

విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తోన్న తమిళ చిత్రం 'మరుదు'. ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి 'రాయుడు' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మే 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదివ్యతో సినీజోష్ ఇంటర్వ్యూ..

పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తా..

ఈ సినిమాలో భాగ్యలక్ష్మి అనే పాత్రలో నటించాను. బోల్డ్ గా ఉండే రోల్. ఫస్ట్ హాఫ్ లో బోల్డ్ గా కనిపించే అమ్మాయి పెళ్ళైన తరువాత సెకండ్ హాఫ్ లో చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర. ఇప్పుడు వస్తోన్న చాలా సినిమాల్లో హీరోయిన్స్ ను తక్కువగా చూపిస్తున్నారు. తమిళంలో విమెన్ కు ప్రాముఖ్యత ఇచ్చే ప్రతి సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాలో కూడా నా రోల్ అలానే ఉంటుంది. పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తాను. 

మొదట చాలా భయపడ్డాను..

విశాల్ హీరో అనగానే కొంచెం భయపడ్డాను. స్టార్ హీరో సెట్స్ మీద ఎలా ఉంటారో..? అనే భయం కలిగింది. కాని ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ లో పని చేసే అబ్బాయిలతో సహా అందరితో ఒకే విధంగా ఉంటారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. తమిళంలో సూరి అనే మరో పెర్సన్ ఉండేవారు. విశాల్ గారు సూరి గారు కలిస్తే ఇక అందరూ నవ్వుకోవడమే.. జోక్స్ చేస్తూ.. చాలా సరదాగా ఉంటారు. 

విశాల్ మంచి మనిషి..

హీరో కంటే ముందు విశాల్ మంచి మనిషి. నడిగర్ సంఘం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. ఏదైనా సమస్య అంటే ముందుంటారు. చాలా తొందరగా రియాక్ట్ అవుతారు. మేము షూటింగ్ కోసం తమిళనాడులోని రాజపాలయం అనే ప్రాంతానికి వెళ్లాం. అక్కడ టాయిలెట్స్ లేక ఊర్లో వారంతా ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా ఆడవాళ్ళు. విశాల్ గారు వెంటనే అక్కడ వారికి సహాయం అందించాలని యూనిట్ అందరి సహకారాన్ని తీసుకున్నారు. నా వంతుగా ఓ పది టాయిలెట్స్ కట్టిస్తానని చెప్పాను. 

తమిల్ నేటివిటీ ఇష్టం..

నాకు మొదటి నుండి తమిళ సినిమాలంటే బాగా ఇష్టం. రెగ్యులర్ గా ఫాలో అయ్యేదాన్ని. అక్కడ న్యాచురాలిటీ, నేటివిటీ అంటే నాకు నచ్చేవి. అంతేకాదు సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉండే పాత్రలే ఎక్కువగా ఉంటాయి. 

విశాల్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్..

తమిళంలో విడుదలయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పదేళ్ళ తరువాత విశాల్ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని మాట్లాడుకుంటున్నారు. చెన్నై కంటే మదురై వంటి ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఇప్పటికే విడుదలయిన పాటలకు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ముఖ్యంగా 'ఒంటిజెడ రోజా' అనే పాట శ్రోతలను అలరిస్తోంది.

అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్..

అమ్మమ్మ, మనువడు మధ్య ఉండే సెంటిమెంట్ తో కథ నడుస్తుంది. ఈ స్టొరీ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. అందుకే తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

తెలుగులో చేయాలనే ఆసక్తి ఉంది..

తెలుగులో మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఉంది. కేరింత తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాను. మంచి సబ్జెక్ట్స్ కోసం ఎదురుచూస్తున్నాను. తమిళంలో వరుసగా సినిమాలు ఒప్పుకోవడం వలన తెలుగు సినిమాలు సైన్ చేయలేకపోతున్నాను. కాని తెలుగులో చేయాలని ఆసక్తిగా ఉంది.

డైరెక్టర్ ను ఫాలో అయిపోయా..

ఈ సినిమాలో విలేజ్ అమ్మాయి పాత్రలో కనిపించాలి. వారి బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ అంతా నాకు కొత్త. దీనికోసం విలేజ్ లో ఉండే కొంతమంది అమ్మాయిలతో మాట్లాడాను. వారు మనకంటే స్టైలిష్ గా మాట్లాడుతున్నారు. ఇక లాభం లేదని డైరెక్టర్ ముత్తయ్య గారిని ఫాలో అయిపోయా.. ఆయన ప్రతి సీన్ నటించి చూపించేవారు. ఆయన ఎలా చేసారో.. బ్లైండ్ గా నేను చేసుకుంటూ.. వెళ్ళిపోయేదాన్ని.

డార్క్ గా చూపించడానికే..

ఈ సినిమాలో నేను ఎక్కువగా మేకప్ చేసుకోలేదు. ముత్తయ్య గారికి మేకప్ ఇష్టం లేదు. నన్ను కొంచెం డార్క్ గా చూపించాలని మేకప్ చేసేవారు. అచ్చంగా గ్రామంలో ఉండే అమ్మాయిలానే కనిపిస్తాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..

కాష్మోరా అనే తమిళ సినిమాలో నటించడానికి అంగీకరించాను. అది మొదలుకావడానికి కాస్త సమయం పడుతుంది. అలానే జీవా హీరోగా చేస్తోన్న మరో సినిమా అంగీకరించాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ