రాజీవ్ సాలూరి, యామిని భాస్కర్. పృధ్వీ ప్రధాన పాత్రల్లో కన్నా సినీ ప్రొడక్షన్ పతాకంపై జి.రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు నిర్మిస్తోన్న చిత్రం 'టైటానిక్'. అంతర్వేది to అమలాపురం అనేది ఉపశీర్షిక. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో రాజీవ్ సాలూరి చిత్రవిశేషాల గురించి విలేకర్లతో ముచ్చటించారు. ''2007 లో నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. 'నోట్ బుక్' సినిమాతో మొదలయిన నా ప్రయాణం ఎంతో సంతోషంగా నడుస్తుంది. ఇప్పటివరకు ఎనిమిది చిత్రాల్లో నటించాను. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. కథ బాగా నచ్చింది. సినిమాలో నా పాత్ర పేరు కార్తిక్. హీరో తను ప్రేమించిన అమ్మాయితో విడిపోయిన తరువాత ఆ అమ్మాయిని తన సొంత మేనమామకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కుటుంబ సభ్యులు. ఆ పెళ్లి ఓ బోట్ లో జరుగుతుంది. ఆ బోట్ పేరే టైటానిక్. అంతర్వేది నుండి అమలాపురం ప్రయాణం చేసే ఆ బోట్ లో హీరో ఎలా ఎంటర్ అవుతాడు. ఆ పెళ్లి జరగకుండా ఎలా చేస్తాడానే అంశాలతో సినిమా నడుస్తుంది. సుమారుగా ఎనబై శాతం సినిమా బోట్ లోనే ఉంటుంది. డైరెక్టర్ గారు చెప్పిన దానికంటే ఇంకా బాగా తీశారు. అవుట్ పుట్ బాగా వచ్చింది. నా కథల ఎంపికలో నాన్నగారు(కోటి) ఇన్వాల్వ్ అవ్వరు. ఎలాంటి సలహాలు కూడా ఇవ్వరు. మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉంటే ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాడ్ని.. నువ్వు హీరో అయ్యావు. నీ డెసిషన్స్ నువ్వే తీస్కో అంటుంటారు. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ 'కేటుగాడు' దర్శక నిర్మాతలతో ఉంటుంది. అదొక హారర్ కామెడీ నేపధ్యంలో నడిచే కథ'' అని చెప్పారు.