Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: నాని

Thu 16th Jun 2016 03:54 PM
nani interview,gentlemen,indraganti mohan krishna  సినీజోష్ ఇంటర్వ్యూ: నాని
సినీజోష్ ఇంటర్వ్యూ: నాని
Advertisement
Ads by CJ

'భలే భలే మగాడివోయ్','కృష్ణగాడి వీరప్రేమ గాథ' వంటి విభిన్నమైన చిత్రాల తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని నటిస్తోన్న మరో వైవిధ్యమైన చిత్రం 'జెంటిల్ మెన్'. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నాని విలేకర్లతో ముచ్చటించారు. 

టైటిల్ చివరిలో పెట్టాం..

ఈ సినిమా టైటిల్ పెట్టడానికి చాలా ఆలోచించాం. టైటిల్ లో కథను కన్వెయ్ చేయకుండా.. ఉండే టైటిల్ కావాలి. కాని ఆ టైటిల్ సినిమాకు యాప్ట్ అవ్వాలి. ఆ సమయంలో 'జెంటిల్ మెన్' లాంటి టైటిల్ అయితే బావుంటుందని టీం అందరం అనుకున్నాం. శ్రీనివాస్ అవసరాల 'జెంటిల్ మెన్' లాంటి టైటిల్ ఎందుకు.. 'జెంటిల్ మెన్' నే టైటిల్ గా ఎందుకు పెట్టకూడదు అన్నాడు. అంతే.. వెంటనే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించాం. సినిమా చూసిన తరువాత టైటిల్ పెర్ఫెక్ట్ అనిపిస్తుంది. షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత చివరలో టైటిల్ పెట్టాం. 

డిఫరెంట్ సినిమా చేయాలనుకున్నాం..

'అష్టాచమ్మా' సినిమా తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి డైరెక్షన్ లో చేయబోయే సినిమా డిఫరెంట్ గా ఉండాలనుకున్నాం. కథ బాగా ఎగ్జైట్ చేసే విధంగా ఉండాలి. ఆయన ఈ కథ చెప్పినప్పుడు జెన్యూన్ గా ఎగ్జైట్ అయ్యాను. ఎలాంటి ఆబ్లిగేషన్ మీద సినిమా చేయలేదు. కథ నచ్చి చేశాను. 'అష్టాచమ్మా' సినిమాకు ఈ సినిమా నాటికి మోహన్ కృష్ణ గారిలో టెక్నికల్ నాలెడ్జ్ బాగా పెరిగింది. 

మనసుకి నచ్చితేనే చేస్తా..

వరుసగా మూడు హిట్ సినిమాలొచ్చాయి కదా అని ఏవేవో జాగ్రత్తలు తీసుకోను. మొదటి నుండి నా మనసుకి నచ్చిన సినిమాలే చేస్తూ.. వచ్చాను. అవే నన్ను ఈ స్థానంలో నిలబెట్టాయి. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ ను ఫాలో అవుతాను. మొదట్లో నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా..? అనే అనుమానం ఉండేది. కాని ఇప్పుడు కంఫర్టబుల్ ప్లేస్ కి వచ్చేశాను. ఎలాంటి భయం లేదు. 

రెమ్యునరేషన్ పెంచమని అడగను..

నా కెరీర్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది 'భలే భలే మగాడివోయ్' సినిమాకే. సక్సెస్ రేట్ పెరిగేటప్పుడు రెమ్యునరేషన్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నేను ప్రత్యేకంగా రెమ్యునరేషన్ పెంచాను. నా సక్సెస్ రేట్ ను బట్టి ప్రొడ్యూసర్స్ ఒక నెంబర్ చెప్తారు అంతే. 

డైరెక్షన్ చేయను..

ఇప్పుడు డైరెక్ట్ చేసే ఆలోచన అయితే లేదు. నటుడిగా చాలా సంతోషంగా ఉంది. నా స్త్రెంగ్థ్ ఏంటో.. నాకు తెలిసింది. హీరోగానే నన్ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. డైరెక్టర్ కావాలనే ప్యాషన్ ఉండేది. ఎప్పటికైనా ఆ కోరికైతే తీర్చుకుంటాను. 

అవి రూమర్స్ మాత్రమే..

నా నెక్స్ట్ సినిమా విరించి వర్మ గారి దర్శకత్వంలో చేస్తున్నాను. ఆ సినిమా ముప్పై శాతం చిత్రీకరణ పూర్తయింది. ఆ సినిమాలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా కనిపిస్తాను. అయితే నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కనిపించనున్నాననే గాసిప్స్ వినిపించాయి. అవి రూమర్స్ మాత్రమే.. అందులో ఎలాంటి నిజం లేదు. 

అదే హైలైట్..

సినిమా జోనరే పెద్ద హైలైట్. ప్రేక్షకులను కంటతడి పెట్టించి, వారిని ఎమోషన్స్ కు గురి చేసే సినిమాలు రావడం తగ్గిపోయాయి. ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. 

అప్పుడే మల్టీ స్టారర్ సినిమాలోస్తాయి..

నాకు మల్టీ స్టారర్ సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ తరహా చిత్రాలకు కథ చాలా ముఖ్యం. అయితే హీరోలు మాత్రం తమకు స్క్రీన్ స్పేస్ ఎంత ఉందనే చూసుకుంటున్నారు. అలా కాకుండా.. క్యారెక్టర్ ను నమ్మి సినిమాల్లో నటిస్తే బావుంటుంది. అప్పుడే మల్టీ స్టారర్ సినిమాలోస్తాయి.

తమిళ సినిమాలంటే చాలా ఇష్టం.. 

తమిళ ఇండస్ట్రీ అంటే నాకు గౌరవం ఎక్కువ. ఎందరో మహానటులను పరిచయం చేసింది. ఇప్పటికే తమిళంలో రెండు, మూడు సినిమాలు చేశాను. అయితే నాకు తమిళ భాష రాదు. అటు ఇటు కాకుండా ఉండిపోవడం ఎందుకని తెలుగులోనే ఉండాలని భావించాను. భవిష్యత్తులో బైలింగ్యువల్ సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. 

మంజుల గారిని నా లైఫ్ లో కలవలేదు..

మంజుల గారి దర్శకత్వంలో నేను నటిస్తున్నానని వార్తలు ప్రచురించారు. నేను ఇప్పటివరకు ఆవిడను ఒక్కసారి కూడా కలవలేదు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్.. 

ప్రస్తుతం విరించి వర్మ సినిమాలో నటిస్తున్నాను. ఆ తరువాత దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో ఓ సినిమా కమిట్ అయ్యాను. అలానే భవ్య క్రియేషన్స్ తో కమిట్మెంట్ ఉంది అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ