Advertisementt

ఆకాష్ పూరీ బర్త్ డే స్పెషల్

Sun 25th Jul 2021 11:16 AM
akash puri,puri jagannadh son akash,akash puri birthday,akash puri birthday special,chor ajar movie first look  ఆకాష్ పూరీ బర్త్ డే స్పెషల్
Akash Puri Birthday Special ఆకాష్ పూరీ బర్త్ డే స్పెషల్
Advertisement
Ads by CJ

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  తనయుడు ఆకాష్ పూరీ.. స్టార్ హీరోల సినెమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినా.. మెహబూబా తో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రొమాంటిక్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చే సమయంలో కరోనా అడ్డుపడింది. రొమాంటిక్ ఇంకా రిలీజ్ కాకుండానే ఆకాష్ పూరి నెక్స్ట్ మూవీ లుక్స్ రివీల్ చేసేసాడు. ఆకాష్ పూరి బర్త్ డే సందర్భంగా అతని లేటెస్ట్ మూవీ చోర్ బజార్ ఫస్ట్ లుక్ అండ్ సెకండ్ లుక్ ని రిలీజ్ చేసింది టీం. చోర్ బజార్ లో ఆకాష్ పూరికి జోడిగా గెహన సిప్పీ నటిస్తోంది. 

దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చోర్ బజార్ చిత్రంలో ఆకాష్ పూరి,గెహన సిప్పీ లతో పాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు.

ఈ రోజు హీరో ఆకాష్ పూరి బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను వదిలింది.టైటిల్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ మాస్ గా ఉంది.హీరో ఆకాష్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. బైక్ పక్కన నిలబడి ఉన్నాడు. చేతిమీద బచ్చన్ సాబ్ పేరుతో టాటు కనిపిస్తుంది. మరో చేత్తో గన్ ఫైరింగ్ చేస్తున్నాడు. చోర్ బజార్ లో ఉండే సామను అంతా ఈ మోషన్ పోస్టర్ లో కనిపిస్తుంది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ ఫెక్ట్ గా సూట్ అయింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన స్పెషల్ సెట్ లో శరవేగంగా జరుగుతుంది. నేడు ఆకాష్ పూరి పుట్టిన రోజు సందర్భంగా అతని కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని కోరుకుంటూ.. సినీజోష్ టీం తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే

Akash Puri Birthday Special:

Puri son Akash Puri Birthday Special

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ