Advertisementt

దుల్క‌ర్ స‌ల్మాన్‌ బ‌ర్త్‌డే స్పెషల్

Wed 28th Jul 2021 05:39 PM
dulquer salman,hanu raghavapudi,swapna cinema,vyjayanthi movies,dulquer birthday glimpse,lieutenant ram look,lieutenant ram title  దుల్క‌ర్ స‌ల్మాన్‌ బ‌ర్త్‌డే స్పెషల్
Dulquer Salmaan Birthday Special దుల్క‌ర్ స‌ల్మాన్‌ బ‌ర్త్‌డే స్పెషల్
Advertisement
Ads by CJ

మలయాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. మలయాళం లో వరస సినిమాలతో దూసుకుపోతున్న దుల్కర్ తెలుగులో న‌టించిన మొద‌టి సినిమా మ‌హాన‌టి ఘ‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు అదే బేన‌ర్ స్వ‌ప్న సినిమా ప‌తాకంపై దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా మ‌రో సినిమా రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్‌ స‌ల్మాన్ న‌టిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ హను రాఘవపూడి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత అశ్వినిద‌త్ నిర్మిస్తున్నారు.

ఈ రోజు (జులై28) దుల్కర్ బర్త్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఓ గ్లిమ్స్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ గ్లిమ్స్‌లో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ ఆక‌ట్టుకున్నారు. ఇది త‌న బ‌ర్త్‌డేకి ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని దుల్క‌ర్  తెలిపారు.

పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న సార‌థ్యంలో  కాశ్మీర్‌లోని ప‌లు అంద‌మైన  లోకేష‌న్స్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

హార్ట్ ట‌చింగ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్స్ తెర‌కెక్కించ‌డంలో ప్ర‌సిద్ది చెందిన హను రాఘ‌వ‌పూడి మ‌రో ఆస‌క్తిక‌ర అంశాల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్లో దుల్క‌ర్ స‌ల్మాన్ చేతిలో ఒక లెట‌ర్ ప‌ట్టుకుని న‌వ్వుతూ సైకిల్‌మీద కూర్చొని ఉన్నాడు.

Dulquer Salmaan Birthday Special:

Dulquer Salman, Hanu Raghavapudi, Swapna Cinema, Vyjayanthi Movies- Birthday Glimpse Of Lieutenant RAM Unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ