Advertisementt

త్వరలో ఫైనల్ చేస్తాను -ప్రియాంక జవాల్కర్

Tue 10th Aug 2021 05:13 PM
priyanka jawalkar,priyanka jawalkar stills,priyanka jawalkar news,priyanka jawalkar interview,  త్వరలో ఫైనల్ చేస్తాను -ప్రియాంక జవాల్కర్
OTT offers are coming -Priyanka Jawalkar త్వరలో ఫైనల్ చేస్తాను -ప్రియాంక జవాల్కర్
Advertisement
Ads by CJ

స్క్రిప్టు నచ్చితేనే సినిమా ఒప్పుకుంటా - హీరోయిన్ ప్రియాంక జవాల్కర్

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్. ఇటీవల స్పీడ్ పెంచిన ఈ నాయిక తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ఈ రెండు చిత్రాల్లో ప్రియాంక అందం, నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో పాత్రికేయులతో ముచ్చటించింది ప్రియాంక. ఆమె ఇంటర్వ్యూ హైలైట్స్ చూస్తే..

- నేను కొంత గ్యాప్ తరువాత నటించిన తిమ్మరుసు హిట్ అయ్యిందని అందరూ అన్నారు. ఎస్ఆర్ కల్యాణమండపం సెకండ్ వేవ్ తరువాత ఫస్ట్ హిట్ అంటున్నారు. థియేటర్ కి ప్రేక్షకులు వస్తారా రారా అనే ఒక డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు థియేటర్స్ కు ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు,  చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్స్ కి వస్తున్నారు. తిమ్మరుసు విడుదల తరువాత  గ్లామర్ పై కొంత కేర్ తీసుకొని వెయిట్ లాస్ అయ్యాను. నేనే వంట చేసుకోవడం ప్రారంభించా. టాక్సీవాలా సినిమా తరువాత సెలెక్టెడ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకొని మూవీస్ సైన్ చేశాను. గమనం సినిమాలో నా రోల్ చిన్నదే అయిన బాగా నచ్చి ఒప్పుకున్నాను.

- నేను నటించిన సినిమాలకు నా ఫ్రెండ్స్ పెద్ద క్రిటిక్స్. వాళ్ళు నేను ఎక్కడ బాగా చేశాను ఎక్కడ మిస్ అయ్యాను వాళ్ళు చెబుతుంటారు. డైరెక్టర్ చెప్పినట్లు చెయ్యడమే నా లక్ష్యం, వారి వల్లే నాకు మంచి రోల్స్ వస్తున్నాయి. బయట నామీద వచ్చే నిగిటీవ్ ను లైట్ తీసుకుంటాను, పాజిటివ్ ను మాత్రమే ఎంజాయ్ చేస్తాను. ఇప్పటిదాకా మంచి సినిమాల్లో నటించాను. భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని ఉంది. ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా డాన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని డాన్స్ నేర్చుకుంటున్నాను.

- తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ విన్నాను త్వరలో ఫైనల్ చేస్తాను. ఓటిటి ఆఫర్స్ వస్తున్నాయి, స్టోరీస్ విన్నాను, కొన్ని ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి పాత్రలే చెయ్యాలని లేదు, నాకు నచ్చిన పాత్ర ఏదైనా చేస్తాను. తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశాను. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా.. అన్నారు.

Click Here: Priyanka Jawalkar Photos

OTT offers are coming -Priyanka Jawalkar:

Priyanka Jawalkar Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ