Advertisementt

బ్రాందీ డైరీస్ ఫ్యామీలీకు -దర్శకుడు శివుడు

Wed 11th Aug 2021 07:44 PM
brandy diaries,brandy diaries movie,brandy diaries director shivudu,brandy diaries director shivudu interview  బ్రాందీ డైరీస్ ఫ్యామీలీకు -దర్శకుడు శివుడు
Brandy Diaries Director Shivudu Interview బ్రాందీ డైరీస్ ఫ్యామీలీకు -దర్శకుడు శివుడు
Advertisement
Ads by CJ

కలెక్టివ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు రచన, దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రాందీ డైరీస్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు ముగించుకుని ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. వ్యక్తిలోని వ్యసన స్వభావం, దానివల్ల వచ్చే సంఘర్షణతో, సహజమైన సంఘటనలు, సంభాషణలు, పరిణతి వున్న పాత్రలతో  కొత్త నటీనటులతో నాచురల్ లోకేషన్స్ లో, సహజత్వానికి పట్టంకడుతూ ఆద్యంతం ఆసక్తికరంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి రేకెత్తించింది. ఈ శుక్రవారం విడుదల అవుతోంది

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ నా సొంత ఊరు  గుంటూరు జిల్లా చిలకలూరిపేట దగ్గర తిమ్మాపురం. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. బాగా చదువుకున్నాను. సివిల్స్ కి కూడా ప్రిపేర్ అయ్యాను. కానీ సినిమా పరిశ్రమలోకి రావాలి అనే తపన బలంగా ఉంది. ప్రతిరోజూ ఏదొక సినిమా చూసేవాడిని. సినిమా పుస్తకాలు చదివే వాడిని. అసిస్టెంట్ కమీషనర్ అఫ్ టాక్స్ ఆఫీసర్ గా పని చేశాను. సినిమా కథలు రాసుకోవటానికి సమయం సరిపోవటం లేదు అని ఆ ఉద్యోగం మానేసి జూనియర్ లెక్చరర్ గా హిస్టరీ పాఠాలు చెబుతూ.. నా సినిమాలోకంలో ఉండే వాడిని. హిస్టరీ పాఠాలు సినిమాటిక్ గా చెప్పేవాడిని. ఆలా కొత్త కొత్త ఆలోచనలు వచ్చేసేవి. ఇలా నా జీవితంలోకి ఆల్కహాల్ కూడా వచ్చింది. బాగా బానిస అయిపోయాను. మళ్ళి ఇప్పుడిపుడే కోలుకుంటున్నాను.

ఈరోజుల్లో సినిమా తీసి మెప్పిచడం చాలా కష్టం. ప్రపంచంలో అన్ని భాషల సినిమాలు ఇప్పుడు ఓ టి టి ద్వారా చూడొచ్చు. ఎన్నో కొత్త కథలు వస్తున్నాయి. మనం చూస్తున్నాం.. ఆహా అంటున్నాం. నేను కూడా కొత్తగా సినిమా చేయాలని.. అది ప్రతి ప్రేక్షకుడికి టచ్ అవ్వాలని.. అని ఈ బ్రాందీ డైరీస్ సినిమా కథ రాసుకున్నా. ప్రస్తుతం ప్రపంచం అంత ఆల్కహాల్ చుట్టు తిరుగుతుంది. ఇలాంటి కథ ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది అని ఈ సినిమా చేశాను.

నేను ఆల్కహాల్ మంచిదా లేదా చెడ్డదా అని చెప్పలేదు కానీ ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గురించి చెప్పాను. చాలా మందికి చాలా రకాల అలవాట్లు ఉంటాయి. కొందరు ప్రతి రోజూ పానీపూరీ తింటారు. అది కూడా అలవాటు లాంటిదే. ఇలా రకరకాల వారికి రకరకాల అలవాట్లు ఉంటాయి. మరి ఇన్ని అలవాట్లు ఉంటే ఆల్కహాల్ ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నారు. ఆల్కహాల్ అతి ప్రాచీన కాలంనాటి నుంచి ఉన్న అలవాటే అని హిందూ పురాణాల్లో ఉంది. ఇంద్రుడు బాగా తాగుబోతని ఉంది. బైబిల్ లో కూడా బ్రెడ్, వైన్ తాగే సంప్రదాయం ఉంది. ప్రాచీనకాలం నుంచి ఉన్న సంస్కృతిని ఇప్పుడు నీచంగా చూస్తున్నారు. రెగ్యులర్ గా మన తెలుగు సినిమాల్లో హీరో.. హీరోయిన్ వదిలేసింది అనే భాదతో ఆల్కహాల్ తాగుతాడు. లేదా ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటారు. ఆలా ఒకటో రెండో సీన్ లు ఉన్నాయి.. కానీ నా సినిమాలో మొత్తం ఆల్కహాల్ మీదే నడుస్తుంది. సినిమాటిక్ గా మంచి కమర్షియల్ సీన్ తో చిత్రీకరించాము.

బ్రాందీ డైరీస్ టైటిల్.. కథ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. ఇది పూర్తిగా వినోద భరితమైన సినిమా. ఎటువంటి సందేశం కానీ లెక్చర్ కానీ లేదు. రెండు గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. ఈ కథ వ్యసన స్వభావం ఉన్న కొంతమంది కథ. ఆ వ్యసనం చుట్టు అల్లుకున్న ఒక అందమైన కుటుంబ కథ. నా జీవితంలో జరిగిన  కొన్ని సంఘటనలను ఈ సినిమాలో ఉంటాయి. ఎటువంటి మెసేజ్ లేదు. ఈ చిత్రంలో ఆల్కహాలే హీరో. మిగతా వాళ్ళంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మాత్రమే. కానీ ఆల్కహాల్ మంచి హీరోనా? చెడ్డ హీరోనా? అని తెలుసుకోవాలని ఉంటే బ్రాందీ డైరీస్ చిత్రం  చూడాల్సిందే. తాగుబోతుల్ని జడ్జ్ చేయటానికి మనకి రైట్ లేదు. అసలు ఎవరిని జడ్జ్ చేయకూడదు. మంచి చెడు జడ్జ్ చేయటానికి మనం ఎవరం. నీకు మంచి అనిపించింది నాకు చెడు అనిపించొచ్చు.

నా సినిమాలో అందరూ కొత్తవాళ్లే, కొత్త నటులు, సీనియర్ రంగస్థల నటులు ఉన్నారు. గుంటూరు, పాలకొల్లు, రాజమండ్రి, శ్రీకాకుళం లాంటి ఊళ్లల్లో మంచి ప్రతిభ ఉన్న రంగస్థల నటులున్నారు. వాళ్ళకి ఈ చిత్రం మంచి అవకాశం కల్పించింది. సినిమా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సెన్సార్ వాళ్ళు క్లీన్ ఫిల్మ్ అన్నారు. ఆల్కహాల్ ఉంది కాబట్టి ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆగష్టు 13న రిలీజ్ అవుతుంది. సొంతగా రిలీజ్ చేస్తున్నాం. మొత్తం 130 థియేటర్స్ లో విడుదల అవుతుంది. కర్ణాటకలో 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లో చూసి ఈ చిన్న సినిమాను ఎంకరేజ్ చేయండి. ఇది చిన్న సినిమానే అయినా 130 థియేటర్లలో రిలీజ్ చేయడమంటే.. గ్రాండ్ రిలీజే అని భావిస్తున్నాం అంటూ ముగించారు.

సినిమా పేరు: బ్రాందీ డైరీస్, బ్యానర్: కలెక్టివ్ డ్రీమర్స్, నిర్మాత : లేళ్ల శ్రీకాంత్, రచన - దర్శకత్వం: శివుడు, సంగీతం: ప్రకాష్ రెక్స్, సినిమాటోగ్రఫీ: ఈశ్వరన్ తంగవేల్, ఎడిటర్: యోగ శ్రీనివాసన్, పి అర్ ఓ: పాల్ పవన్, కథానాయకుడు: గరుడ శేఖర్, కథానాయకి: సునీతా సద్గురు, ఇతర నటీనటవర్గం: నవీన్ వర్మ, కె వి శ్రీనివాస్, రవీంద్ర బాబు, దినేష్ మద్నే, ఇతరులు.

Brandy Diaries Director Shivudu Interview:

Brandy Diaries Director Shivudu Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ