Advertisementt

రీతూ వర్మ ఇంటర్వ్యూ

Tue 26th Oct 2021 07:04 PM
ritu varma,ritu varma interview,ritu varma interview about varudu kaavalenu movie,ritu varma news,ritu varma photos  రీతూ వర్మ ఇంటర్వ్యూ
Ritu Varma Interview రీతూ వర్మ ఇంటర్వ్యూ
Advertisement
Ads by CJ

నాగ శౌర్య , రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ వరుడు కావలెను సినిమా ఈ నెల 29న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సందర్భంగా సినిమాలో భూమి పాత్రలో నటించిన హీరోయిన్ రీతు వర్మ తన క్యారెక్టర్ గురించి  సినిమా గురించి కొన్ని విశేషాలు మీడియాతో చెప్పుకుంది. ఆ విశేషాలు రీతు మాటల్లోనే... 

స్టోరీ బాగా నచ్చింది: లక్ష్మీ సౌజన్య గారు ఈ కథ చెప్పగానే బాగా నచ్చేసింది. అలాగే భూమి క్యారెక్టర్ కూడా ఎట్రాక్ట్ చేసింది. ఫీమేల్ లీడ్ కి ఛాలెంజింగ్ రోల్స్ చాలా రేర్ గా వస్తుంటాయి. అలాంటి క్యారెక్టర్ తో నేను చేసిన సినిమా ఇది. ఇప్పటి వరకూ నేను చేసిన  క్యారెక్టర్స్ కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుంది.  సినిమా చూశాక భూమి క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. 

ఫీమేల్ సెంట్రిక్ కాదు: టీజర్ , ట్రైలర్ చూసి ఇది ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అనుకుంటున్నారు. కానీ ఇది ఫీమేల్ సెంట్రిక్ కాదు. ఒక ప్యూర్ లవ్ స్టోరి. మంచి ఎమోషన్స్ ఉంటాయి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ వినేలా సాంగ్స్ ఉంటాయి. శౌర్య క్యారెక్టర్ కి స్టోరీలో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవన్నీ రిలీజ్ తర్వాత మీరే చెప్తారు.

అలాంటి తేడా ఏం లేదు: డైరెక్టర్ ఫీమేల్ కాబట్టి నా క్యారెక్టర్ స్ట్రాంగ్ గా రాసింది అనుకోను. పెళ్లి చూపులు లో కూడా నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాకపోతే  లక్ష్మీ సౌజన్య ఒకమ్మాయి కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆలోచించి ఈ క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నారు. భూమి క్యారెక్టర్ నేను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది. 

మా పెయిర్ వర్కౌట్ అయింది: శౌర్య చాలా డెడికేటెడ్ గా ఉంటాడు.  షూట్ ఉన్నప్పుడు టైం కి పర్ఫెక్ట్ గా వచ్చేస్తాడు.  వర్కౌట్స్ చేసి ఎప్పుడూ ఫిట్ గా ఉంటాడు. ముఖ్యంగా లవ్ స్టోరీ కి పెయిర్ సెట్ అవ్వాలి. అప్పుడే సినిమా ఇంకా ఎక్కువగా రీచ్ అవుతుంది. మా పెయిర్ బాగుందని చాలా మంది చెప్తున్నారు. సో ...మా పెయిర్ వర్కౌట్ అయింది కాబట్టి రిలీజ్ కి ముందే సగం రిజల్ట్ వచ్చేసినట్టే.

ఇదే ఫస్ట్ టైం: డాన్స్ లో నేను పూర్. కానీ డాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు నాకు డాన్స్ చేసే సాంగ్స్ పడలేదు. కానీ ఫస్ట్ టైం ఇందులో ఒక మాస్ సాంగ్ చేశాను. చాలా కష్టపడి డాన్స్ చేశాను. ఆ సాంగ్ ని థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ సాంగ్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో వస్తుంది.

నా ఫేవరేట్ సాంగ్ అదే: కోల కళ్ళే ఇలా నా ఫేవరేట్ సాంగ్. బేసిక్ గా సిద్ శ్రీరామ్ ఏం పాడినా నాకు నచ్చుతుంది. సో తన వాయిస్ కూడా సాంగ్ కి ప్లస్ అయ్యింది. అలాగే ఆల్బంలో మనసులోనే నిలిచిపోకే అనే సాంగ్ కూడా బాగా ఇష్టం.

ఓల్డ్ స్కూల్ రొమాన్స్ : సినిమాలో లవ్ స్టోరీ అందరికీ నచ్చేలా ఉంటుంది. రెగ్యులర్ గా అనిపించదు. ఓల్డ్ స్కూల్ రొమాన్స్ ఉంటుంది. మా డైరెక్టర్ చాలా అందంగా చూపించారు. ఈ సినిమా తర్వాత మా డైరెక్టర్ కి మంచి పేరు వస్తుంది. 

 ఇన్నోసెంట్ క్యారెక్టర్ : నదియా గారు ఇప్పటి కొన్ని పవర్ ఫుల్ రోల్స్ చేశారు. కానీ  ఇప్పటివరకూ చేయని ఓ ఇన్నోసెంట్ రోల్ లో కనిపిస్తారు. నదియా గారి క్యారెక్టర్ కి అందరూ ఇంప్రెస్ అవుతారు. ఆవిడతో నటించడం చాలా హ్యాపీ గా ఫీలయ్యాను. 

ఫెస్టివల్ లా ఫీలవుతున్నా : సినిమా రిలీజ్ కి ముందు ఎవరికైనా నర్వస్ నెస్ ఉంటుంది. నాకు కూడా ఉంది. కానీ ఈ ఫేజ్ ని ఒక ఫెస్టివల్ లా ఫీలవుతూ ఎంజాయ్ చేస్తున్నాను. రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ లో కూడా సినిమా బాగుంది అనే పాజిటివ్ టాక్ వచ్చింది. సో అవన్నీ విని సంతోషంగా ఉంది. 

ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి: సినిమాను పెద్ద స్కేల్ లో చూపించినట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంటాయి. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమాను ఎంతో ప్యాషన్ తో నమ్మకంగా నిర్మించారు. వారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.

చాలా టైం ఉంది: నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది. ఇంకా రెండు మూడేళ్ళు పట్టొచ్చు. ఇంట్లో ఆ టాపిక్ గురించి నన్ను ఇబ్బంది పెట్టరు. అప్పుడప్పుడు సరదాగా అంటుంటారు తప్ప ఆ విషయాన్ని నాకే వదిలేశారు. 

అందుకే ఈ గ్యాప్ :పెళ్లి చూపులు తర్వాత మళ్ళీ అలాంటి రోల్స్ కానీ స్క్రిప్ట్స్ కానీ రాలేదు. మధ్యలో తమిళ్ లో కొన్ని సినిమాలు చేశాను కానీ అవి రిలీజ్ లేట్ అయ్యాయి. ప్రస్తుతం శర్వానంద్ తో తెలుగు , తమిళ్ బైలింగ్వెల్ సినిమా చేస్తున్నాను. అలాగే తమిళ్ లో మరో సినిమాతో పాటు మరో  వెబ్ సిరిస్ చేస్తున్నాను. తెలుగులో ఇంకా ఏ సినిమా కమిట్ అవ్వలేదు.

Ritu Varma Interview :

Ritu Varma Interview about Varudu Kaavalenu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ