Advertisementt

అదే నన్ను ఇన్స్పైర్ చేసింది -హీరో జిషాన్ ఉస్మాన్

Wed 10th Nov 2021 06:59 PM
telangana devudu,telangana devudu movie,telangana devudu hero zishan usman,hero zishan usman,srikanth  అదే నన్ను ఇన్స్పైర్ చేసింది -హీరో జిషాన్ ఉస్మాన్
Hero Zishan Usman Interview అదే నన్ను ఇన్స్పైర్ చేసింది -హీరో జిషాన్ ఉస్మాన్
Advertisement
Ads by CJ

తెలంగాణ దేవుడు మూవీ హీరో జిషాన్ ఉస్మాన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ

ఉద్యమ నాయకుడిగా శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం తెలంగాణ దేవుడు. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. హరీష్‌ వడత్యా దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఈ చిత్రాన్ని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయకుడు జిషాన్ ఉస్మాన్ మీడియా ప్రతినిధులతో ముఖాముఖి లో పాల్గొన్నారు..

>తెలంగాణ దేవుడు చిత్రంలో మీకు అవకాశం ఎలా వచ్చింది?

>నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు దర్శకుడు హరీష్ గారు వచ్చి నన్ను కలసి నీతో సినిమా చేయాలనుకుంటున్నాను అన్నారు మా నాన్న గారితో కూడా ఇదే విషయం చెప్పగానే ఆయన కూడా సరే అన్నారు.. అప్పుడే డైరెక్టర్ తెలంగాణ దేవుడు కథ నాకు వినిపించాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ గారి బయోపిక్ అని తెలిసి కథ బాగా నచ్చి సినిమా చేయడానికి అంగీకరించాను.

>ఈ పాత్రలో నటించడానికి మీ ఇన్స్పిరేషన్ ఏమిటి?

>మన సీఎం కె సీ ఆర్ గారే.. ఆయన ఒక ఉద్యమకారుడుగా అప్పుడు పోరాడిన విధానం అందరికీ తెలిసిందే... అదే నన్ను ఇన్స్పైర్ చేసింది. ఈ పాత్రలో  నటించి నందుకు చాలా గర్వాంగా కూడా ఉంది.

>మీకు తెలంగాణ ఉద్యమం గురుంచి తెలుసా?

>ఒకప్పుడు అంతగా తెలియదు తెలంగాణ గురుంచి.. కానీ కథ విన్న తరువాత బాగా తెలుసుకున్నాను..

>మీకు ఈ సినిమాలో జోడీ ఉందా?

>అవునండి.. నాకు జంటగా సుష్మిత నటించింది. ఈ సినిమాలో నా పాత్ర కూడా స్కూలింగ్ నుంచి మ్యారేజ్ అయ్యే వరకు ఉంటుంది.

>ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ లో నటించడం మీకు ఎలా అనిపిస్తోంది?

>తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రిగారి పాత్రలో నటించడం చాలా గర్వంగానూ, ఛాలెంజింగ్ గా అనిపిస్తోంది.. ఎందుకంటే కె సి ఆర్ గారు ఒక ఉద్యమకారుడిగా చాలా పోరాడి గెలిచారు అలాంటి గొప్ప వ్యక్తి పాత్రలో నటించడం నిజంగా గర్వంగా అనిపిస్తోంది అంటూ ముగించారు.. ఈ చిత్ర హీరో జిషాన్ ఉస్మాన్.

Hero Zishan Usman Interview:

Telangana Devudu Hero Zishan Usman Interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ