Advertisementt

పుష్పక విమానం గీత్ సైని ఇంటర్వ్యూ

Thu 11th Nov 2021 07:31 PM
geeth saini,anand deverakonda,geeth saini interview,pushpaka vimanam movie  పుష్పక విమానం గీత్ సైని ఇంటర్వ్యూ
Geeth Saini Interview పుష్పక విమానం గీత్ సైని ఇంటర్వ్యూ
Advertisement
Ads by CJ

పుష్పక విమానం చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న మరో యువ తార గీత్ సైని. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి అనే క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. మీనాక్షి అనే క్యారెక్టర్ లో నటించడం, ఆ మూడ్ లో ఉండిపోవడానికి చాలా కష్టపడ్డానని చెబుతోంది గీత్ సైని. పుష్పక విమానం సినిమా చూస్తే నాయికగా తన ఎఫర్ట్ తెలుస్తందని అంటోంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న పుష్పక విమానం చిత్రంలో నటించిన ఎక్సీపిరియన్స్ ను మీడియాతో పంచుకుందీ యంగ్ హీరోయిన్.

గీత్ సైని మాట్లాడుతూ...కాలేజ్ డేస్ నుంచి నాకు డాన్సులు చేయడం అంటే  చాలా ఇష్టం. డాన్సులతో పాటు తెలుగు కామెడీ చిత్రాలు చూడటం ఇంట్రెస్ట్ ఉండేది. మా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. నేను సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారని అనుకోలేదు. పుష్పక విమానం సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, నా స్నేహితురాలు ఒకరు నా ఫొటోస్ పంపింది. ఆడిషన్ చేసినప్పుడు మీనాక్షి క్యారెక్టర్ కు నేను బాగా సరిపోతాని దర్శకుడు దామోదర సెలెక్ట్ చేశారు. మీనాక్షి చిట్టిలంక సుందర్ వైఫ్. తను పెళ్లయ్యాక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీనాక్షి క్యారెక్టర్ లో నటించడం అంత సులువు కాదు. ఎప్పుడూ ఒక మూడ్ లో ఉండాల్సి వచ్చేది. సెట్ లో ఎవరైనా జోక్ వేసినా, నా మూడ్ లోనే ఉండేందుకు అస్సలు రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు. అలా మీనాక్షి క్యారెక్టర్ ను ప్లే చేశాను. పుష్పక విమానం చూశాక ఆడియెన్స్ నా క్యారెక్టర్ ను ఇష్టపడతారు. ఆనంద్ చాలా మంచి వ్యక్తి. షూటింగ్ టైమ్ లో చాలా సపోర్టివ్ గా ఉండేవారు. నా కెరీర్ లో ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా చేస్తాననుకోలేదు. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా మరో ప్రాజెక్ట్ చేయొద్దని, వచ్చిన కొన్ని ఆఫర్స్ కూడా వదులుకున్నాను. సాయి పల్లవిలా డాన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. అని చెప్పింది.

Geeth Saini Interview:

Geeth Saini Interview about Pushpaka Vimanam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ