Advertisementt

1997తో సంతృప్తి దక్కింది -హీరో, దర్శకుడు డా. మోహన్

Tue 23rd Nov 2021 05:53 PM
1997 movie,1997 telugu movie,dr. mohan interview,hero cum director dr. mohan interview  1997తో సంతృప్తి దక్కింది -హీరో, దర్శకుడు డా. మోహన్
Hero Dr. Mohan interview 1997తో సంతృప్తి దక్కింది -హీరో, దర్శకుడు డా. మోహన్
Advertisement
Ads by CJ

1997 చిత్రంతో నటుడిగా, దర్శకుడిగా సంతృప్తి దక్కింది -హీరో, దర్శకుడు డా. మోహన్

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న 1997.  నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 26న గ్రాండ్ గా విడుదల అవుతుంది. ఈ సినిమాతో అటు హీరోగా, ఇటు దర్శకుడిగా నటిస్తున్నాడు  డా. మోహన్. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 26న విడుదల అవుతున్న సందర్బంగా హీరో, దర్శకుడు డా. మోహన్  ఇంటర్వ్యూ విశేషాలు ..

>1997 సినిమా గురించి చెప్పండి ?

ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కథ. నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ కథ ఉంటుంది. ఇందులో ఒక అమ్మాయిని రేప్ చేసిన తరువాత ఆమె పడే మానసిక వేదన, ముఖ్యంగా ఆమె తల్లి తాలూకు ఎమోషన్ ఎలా ఉంటుంది. ఒక అమ్మాయిని రేప్ చేసాక చంపేస్తున్నారు. ఎందుకు? అమ్మాయిని రేప్ చేయడానికి కారణం కామం. ఆ కామాన్ని తీర్చుకోవాలంటే చాలా దారులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు అమ్మాయిలను రేప్ చేస్తున్నారు. ఇది ఓ డోరా అహంకారానికి బలైన ఓ అమాయకురాలు కథను చెప్పే ప్రయత్నం. అయితే తక్కువ కులానికి చెందిన వాళ్ళను ఇంట్లోకి రానివ్వరు, గుడిలోకి రానివ్వరు కానీ ఆమెతో లైంగిక వాంఛ తీర్చుకోవడానికి పనికి వస్తుందా? ఇక్కడ లేని అంటరానితనం అన్నది ఎందుకు అక్కడ లేదు అన్న అంశంతో ఈ సినిమా ఉంటుంది.

> అంటే ఈ కథ 1997లో జరిగిందా?

1997 లో జరిగిన కథ కాదు.. నేను ఆ సమయంలో విన్న కథ, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాను, హాలిడేస్ కు ఊరికి వెళ్ళినప్పుడు మా తాతగారు చెప్పిన కథ ఇది. అప్పటినుండి ఆ కథ నా మైండ్ లో అలా ఉండిపోయింది. ఆ కథను తెరపై ఆవిష్కరించాలని ఉద్దేశంతో సినిమాగా తీసాను. ఇలాంటి సంఘటనలను ప్రజలకు చెప్పాలనే ప్రయత్నమే.

>అసలు ఈ సినిమా ఎలా సెట్స్ పైకి వచ్చింది?

ఈ కథ ఆలోచన వచ్చాక దాన్ని రాసుకున్నాను . ఆ తరువాత నటుడు జీవి నాకు ఫ్రెండ్ ఆయనను కలిసాను, కథ విన్నాకా అయన కూడా చాలా బాగుంది అన్నారు. మరి దీన్ని ఎలా తెరపైకి తేవడం అన్న ఆలోచనలో నిర్మాతలను కలవడం అదంతా వర్కవుట్ అవ్వదన్న ఆలోచనతో మనమే చేయాలనీ మొదలెట్టాం. అలాగే దర్శకత్వం విషయంలో కూడా వేరే దర్శకులను అడిగాను. కానీ నేను చెప్పాలనుకున్న కథను మరోలా చెప్పే ప్రయత్నం చేయడంతో ఇలా కాదు అని నేనే చెప్పాలని దర్శకత్వం చేశాను.

> ఇలాంటి సంఘటనల గురించి ఏమి చెప్పాలని మీ ప్రయత్నం?

ఏ మధ్య కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాంఛ తీర్చుకోవడానికి అమ్మాయిని రేప్ చేయాలా? వాంఛ తీర్చుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయ్ కదా. అలాగే తక్కువ జాతి వాళ్లపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అయితే ఈ సినిమా అంత ఘాడంగా ఏమి ఉండదు. చాలా కూల్ గా సినిమా సాగుతుంది. సీన్స్ కూడా చాలా సహజంగా అనిపిస్తాయి.

>సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉంది?

సెన్సార్ వాళ్ళు అప్రిసియేట్ చేసారు. చాలా బాగుంది. మంచి పాయింట్ ఎంచుకుని తీసారని అన్నారు. అక్కడ మహిళా సభ్యులైతే కన్నీళ్లు పెట్టించావని అన్నారు.

>మొదటి సినిమాకే నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా చేయడం రిస్క్ అనిపించలేదా?

ఈ కథ అనుకున్నాకా ఇందాక చెప్పినట్టు కథ ఎలాగైనా తెరపై కనిపించాలంటే మనమే రిస్క్ చేయాలనీ ఫిక్స్ అయ్యాను. నిజం చెప్పాలంటే వేరే దారిలేక నేనే చేయాల్సి వచ్చింది.

>మీ పాత్ర గురించి చెప్పండి?

ఇందులో నేను ఐ పి ఎస్ పాసై అప్పుడే ఓ ఉరికి వెళ్లిన పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. ఊర్లలో జరుగుతున్న ఈ సంఘటనలను ఆపేందుకు ప్రయత్నం చేసే పోలీస్. అని రకాల షేడ్స్ ఉంటాయి.

>ఇలాంటి కథ కమర్షియల్ గా చెప్పడం కష్టం.. కానీ ఇప్పుడు కమర్షియాలిటీ ఉంటె తప్ప ప్రేక్షకులు చూడరు? మరి దాన్ని ఎలా సెట్ చేసారు?

ఇది కూడా కమర్షియల్ వే లోనే చెప్పే ప్రయత్నం చేసాం. ఇప్పుడు ఈ కథను చెప్పుకుంటే పొతే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది. కాబట్టి .. దాన్ని కమర్షియల్ హంగులతో చూపించే ప్రయత్నం చేసాం. అయితే ఇందులో ఐటెం సాంగ్, అమ్మాయి ఎక్స్పోజింగ్ లాంటివి ఉండవు.  

>కోటి మ్యూజిక్ గురించి?

నాకు మొదటి నుండి కోటిగారంటే చాలా పరిచయం. ఈ కథ అయన విన్నాక చాలా బాగుందని చెప్పారు. ఆ తరువాత నువ్వు సినిమా మొదటి సారి చేస్తున్నావు కాబట్టి సినిమా చేయి మొదటి కాపీ వచ్చాక చేస్తానని అన్నారు. ఆ తరువాత సినిమా చూసి మోహన్ ఈ సినిమాకు నేను మ్యూజిక్ చేస్తున్నాను చాలా గొప్పగా తీశావని అన్నారు. అయన ఆర్ ఆర్ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అలాగే ఏమి బతుకు సాంగ్ మంగ్లీ పాడింది. అది 8 మిలియన్ వ్యూస్ వరకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంది.

>నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ ల గురించి?

ఇందులో నవీన్ చంద్ర నా పై అధికారిగా కనిపిస్తాడు. నవీన్ చంద్ర నటన గురించి చెప్పాల్సిన పనిలేదు. అద్భుతంగా చేసాడు. ఇక శ్రీకాంత్ అయ్యంగార్ నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయన ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతారు. కాబట్టి ఇందులో చారి అనే పోలీస్ గా అదరగొట్టాడు. ఈ సినిమాలో నేను, నవీన్ చంద్ర హీరోలం కాదు ఈ సినిమాకు కథే హీరో.

>ఈ సినిమా విషయంలో నటుడిగా, డైరెక్టర్ గా ఏది సంతృప్తి ఇచ్చింది?

నాకు ఏ పని చేసిన అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి చేయడం ఇష్టం. ఈ సినిమా విషయంలో నటుడిగా, దర్శకుడిగా నాకు రెండు సంతృప్తి ఇచ్చాయి. ఇవే కాదు నేను డాక్టర్ గా ఉన్నా, లేక మాకు లీల గ్రూప్ పేరుతొ స్కూల్, బట్టల బిజినెస్ లు ఉన్నాయి. ఈ బిజినెస్ విషయంలో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఆ పని చేశాను.

>నెక్స్ట్ సినిమా ఎప్పుడు?

ప్రస్తుతం ఈ సినిమా పైనే ఫోకస్ పెట్టాము. ఇది విడుదలైన తరువాత మిగతా సినిమా గురించి ఆలోచిస్తా.

Hero Dr. Mohan interview:

1997 movie hero cum director Dr. Mohan interview

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ