Advertisementt

నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని.!

Tue 08th Feb 2022 08:18 PM
director manu anand,director manu anand interview,fir movie,r avi teja,vishnu vishal  నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని.!
Director Manu Anand Interview నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని.!
Advertisement
Ads by CJ

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్ట‌ర్ విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ `ఎఫ్ఐఆర్`. ఈ  చిత్రానికి  మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో  ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ద‌ర్శ‌కుడు మను ఆనంద్ తో ఇంట‌ర్వ్యూ విశేషాలు.

ఎఫ్‌.ఐ.ఆర్‌. ఏ త‌ర‌హా సినిమా?

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ. యంగ్ ముస్లిం టెర్ర‌రిజంలో కేసులో ఇరుక్కుంటాడు. ఆ త‌ర్వాత ఏమ‌యింది అనేది క‌థ‌.

మీకు మొద‌టి సినిమా. విష్ణు విశాల్ ను ఎలా ఒప్పించ‌గ‌లిగారు?

ముందు విష్ణుకు డ్రెగ్ నేప‌థ్యంలో ఓ క‌థ చెప్పాను. అది భారీ సినిమా అవుతుంద‌ని మ‌రో క‌థ చెప్ప‌మ‌న్నారు. అప్పుడు ఎఫ్‌.ఐ.ఆర్‌. చెప్పాను.

మీ నేపథ్యం గురించి చెప్పండి?  

నేను ఆస్ట్రేలియాలో మ‌ల్టీనేష‌న‌ల్ కంపెనీలో ప‌నిచేశాను. సినిమాపై ఇంట్రెస్ట్‌తో 2011లో ఇండియా వ‌చ్చాను. గౌత‌మ్ మీన‌న్ ద‌గ్గ‌ర 8 సంవ‌త్స‌రాలు ప‌నిచేశాను. 

దేశంలో లెఫ్ట్  రైట్ అనే గ్రూపులున్నాయి. ఇలాంటి టైంలో ఎఫ్‌.ఐ.ఆర్‌ వంటి సినిమా రిస్క్ ఏమో?

నేను ఎఫ్‌.ఐ.ఆర్‌.లో ఎటువంటి కాంట్ర‌వ‌ర్సీని ట‌చ్ చేయ‌లేదు. ఒక ముస్లిం బోయ్ ప్ర‌పంచాన్ని ఏ కోణంలో చూస్తాడు అనేది చూపించాను. ఇది ఏ మ‌తానికి సంబంధించిన సినిమా కాదు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. హ్యూమ‌న్ రిలేష‌న్స్‌, డ్రామా కూడా వుంది. డైలాగ్స్ కూడా ఎవ‌రినీ టార్గెట్ చేసిన‌ట్లు వుండ‌వు. మ‌న‌ది సెక్యుల‌ర్ దేశం. ఫిలింలో కూడా అదే మేం చెబుతున్నాం. సినిమా చూశాక ప్రేక్ష‌కుడే తీర్పు ఇస్తాడు. 

ట్రైలర్ చూస్తే కంప్లీట్ యాక్ష‌న్ సినిమాలా వుంది. మరి ముగ్గురు హీరోయిన్ల‌కు స్పేస్ వుందా?

ఇందులో హీరో, విల‌న్‌, హీరోయిన్ అనేది లేదు. మూడు ఫిమేల్ పాత్ర‌లున్నాయి. అవి క‌థ‌కు కీల‌కం. 30 నిముషాల‌పాటు వారి పాత్ర‌లే వుంటాయి. విష్ణు పెద్ద‌గా క‌నిపించ‌డు. రానురాను క‌థ లో టిస్ట్‌లు క‌నిపిస్తాయి.

ర‌వితేజ‌ మీ సినిమాలో ఎలా ప్ర‌వేశించారు?

విష్ణు భార్య జ్వాలా గుప్త‌గారు ర‌వితేజ‌కు క్లోజ్ ఫ్రెండ్‌. అందుకే ఈ సినిమా పూర్త‌య్యాక  ఆరు నెల‌ల క్రితం ట్రైల‌ర్ చూపించారు. అది చూడ‌గానే సినిమా చూస్తాన‌న్నారు. చూశాక చాలా బాగుంది.. నేను ఈ సినిమాకు హెల్ప్ చేస్తాన‌ని ముందుకు వ‌చ్చారు.

ఒకేరోజు రవితేజ‌ సినిమా మీ సినిమా విడుదలవడం ఎలా అనిపిస్తుంది?

ర‌వితేజ ఖిలాడి అంచ‌నాల‌తో వస్తుంది. ఫ్యాన్స్ చూస్తారు. అలాగే ర‌వితేజ స‌మ‌ర్ప‌కులుగా వున్నార‌నే ఆస‌క్తితో మా సినిమానూ ప్రేక్ష‌కులు, ఫ్యాన్స్ చూస్తార‌నే న‌మ్మ‌కం వుంది.

మీ సినిమాను ఎందుకు చూడాలంటే ఏమి చెబుతారు?

తెలుగు ఆడియ‌న్స్ సినిమా ప్రియులు. మంచి సినిమాని ఆద‌రిస్తారు. కొత్త‌వారిని స‌పోర్ట్ చేస్తారు. 

తెలుగులో మీకు న‌చ్చిన హీరో ఎవ‌రు.?

నేను ప‌వ‌న్ క‌ళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ ని. ఆయ‌న సినిమా త‌ప్ప‌కుండా చూస్తా. అలాగే మ‌హేష్‌బాబు సినిమాలు చూస్తా. పుష్ప సినిమా కూడా చెన్నైలో తెలుగు వ‌ర్ష‌న్ చూశా.

ద‌ర్శ‌కులలో ఎవ‌రంటే ఇష్టం?

కొర‌టాల శివ‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో చాలా అంశాలు దాగి వుంటాయి. అలాగే బాహుబ‌లి వంటి ఇంట‌ర్నేష‌నల్ సినిమా తీసిన రాజమౌళిగారు కూడా ఇష్టం.

Director Manu Anand Interview:

Director Manu Anand Interview about FIR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ