Advertisementt

నా నెక్స్ట్ హీరో నాగ చైతన్య: కిషోర్ తిరుమల

Wed 16th Feb 2022 05:22 PM
director kishor tirumala,kishor tirumala interview,adavallu meeku joharlu movie  నా నెక్స్ట్ హీరో నాగ చైతన్య: కిషోర్ తిరుమల
Kishor Tirumala Interview నా నెక్స్ట్ హీరో నాగ చైతన్య: కిషోర్ తిరుమల
Advertisement
Ads by CJ

ఫిబ్రవరి 25 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రమోషన్స్ జోరు గా మొదలైపోయాయి. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో తలపడడం అంటే కాస్త రిస్కీ విషయమే.. అయినా.. ఆడవాళ్లు మీకు జోహార్లు ఎక్కడా తగ్గడం లేదు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర దర్శకుడు కిషోర్ తిరుముల సినీజోష్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు.

కిషోర్ తిరుమల ఇంటర్వ్యూలో హైలైట్స్

ఈ సినిమాకు శ‌ర్వానంద్‌నే అనుకున్నారా?

ముందుగా ఆయ‌న్నే అనుకున్నాం. శర్వానంద్ వేరే జోనర్‌లకు చెందిన సినిమాలు చేస్తున్నాడని భావించాడు. అందుకే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చెప్పమని అడిగాడు. ఈ క‌థ చెప్పాను. శ‌ర్వా క‌థ‌ను వింటూ ఆనందించాడు. అతను కథను ఓకే చేసిన తర్వాత, నేను కొన్ని మార్పులు చేసి స్క్రిప్ట్‌ను రూపొందించాను.

ర‌ష్మిక క‌థ విని ఏమ‌న్నారు?

త‌ను చాలా బిజీ ఆర్టిస్టు. ఈ క‌థ‌ను రష్మిక మందన్న కు ఎక్స్ప్లెయిన్ చేయ‌గానే ఉల్లాసంగా అనిపించి వెంట‌నే చేసేస్తాను అని చెప్పింది. 

ఎక్కువ మంది మ‌హిళ‌లు వుండ‌డంలో కథ ఎలా సాగుతుంది?

ఒక ఇంటిలో ఒకే ఒక్క వార‌సుడు పుడ‌తాడు. అత‌నికి ఐదుగురు అక్కా చెల్లెళ్ళు వుంటారు. వారు అత‌న్ని ఎంత గారాబంగా, బాధ్య‌త‌గా చూస్తార‌నేది ఇందులో చూపించాను. వారి భావోద్వేగాలు ఈ వ్యక్తి చుట్టూ తిరుగుతాయి. నేను క‌థ‌ను  కాగితంపై పెడితే ఎంటర్టైన్మెంట్  ఉండేలా చూసుకుంటాను.

రిలీజ్ టైం క‌రెక్టే అనుకుంటున్నారా?

భీమ్లా నాయక్ విడుదల గురించి మీరు అడుగుతున్నారని అర్థ‌మైంది. మా సినిమా రిలీజ్ డేట్ అనేది నిర్మాతల ఫైనల్ చేస్తారు.

ఓటీటీవైపు వెళ్ళే ఆలోచ‌న వుందా?

OTT చేయడం అనేది ఒక ప్రతిభ. కానీ నేను పెద్ద స్క్రీన్ నే ఇష్ట‌ప‌డ‌తాను.

మీ కొత్త ప్రాజెక్ట్‌లు?

నా తదుపరి సినిమా నిర్మాత డివివి దానయ్య గారితో ఉంటుంది. ఇది రామ్-కామ్ అవుతుంది. హీరోగా నాగ చైతన్య అనుకుంటున్నాం.. ఇంటర్వ్యూ అంటూ ముగించారు.

Kishor Tirumala Interview :

Director Kishor Tirumala Interview about Adavallu meeku Joharlu Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ